»   » ఒబామా రాకపై....రేణు దేశాయ్‌కి డౌట్ వచ్చింది?

ఒబామా రాకపై....రేణు దేశాయ్‌కి డౌట్ వచ్చింది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటన సందర్భంగా గత కొన్ని రోజులుగా దేశంలో ఎంత హడావుడి జరిగిందో కొత్తగా చెప్పక్కర్లేదు. గణతంత్ర వేడుకల్లో పాల్గొనడానికి వచ్చిన ఒబామా ఇక్కడ ఉందిన రెండు రోజులే అయినా....గత నెల రోజుల ముందు నుండే ఆయన పర్యటకు సంబంధించిన ఏర్పాట్లు జరిగాయి.

ఇక మీడియా హడావుడి అంతా ఇంతా కాదు. ఆయన వాడే విమానం...కారు, ఇతరాల గురించి పుంఖాలు ఫుంఖాలుగా కథనాలు వెలవరించాయి. ఈ హడావుడి అంతా చూసిన రేణు దేశాయ్‌కి ఓ డౌట్ వచ్చింది. ‘మన ప్రధానమంత్రి అమెరికా పర్యటనకు వెళ్లినపుడు అక్కడి పౌరులు, మీడియా ఇదే విధమైన సూపర్ క్రేజ్ ప్రదర్శించారా?' అంటూ ప్రశ్న సంధించింది.

ఈ వ్యాఖ్యలు బట్టి ఆమె మనసులో ఒబామా పర్యటన పట్ల మనం అతి చేస్తున్నామనే భావన ఉన్నట్లు స్పష్టమవుతోంది. అయితే ఆమె ప్రశ్నలో పస లేదని కొందరు అంటున్నారు. ప్రపంచంలో అగ్ర రాజ్యంగా అధిపత్యం చలాయిస్తున్న అమెరికా అధ్యక్షుడి పర్యటన అంటే ఈ మాత్రం క్రేజ్ ఉండటం సహజమే అంటున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Renu Desai's Question On Obama Visit

ఆ సంగతి పక్కన పెడితే రేణు దేశాయ్ దర్శకత్వం వహించిన ‘ఇష్క వాలా లవ్' ఇంకా విడుదలకు నోచు కోవడం లేదు. పవన్ కళ్యాణ్‌తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ మరాఠీలో ఫిల్మ్ ప్రొడక్షన్ సంస్థను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. తన కూతురు పేరు మీద 'శ్రీ ఆద్య ఫిలింస్', కొడుకు పేరు మీద ‘అకీరా ఫిల్మ్స్' అనే సినీ నిర్మాణ సంస్థలను స్థాపించింది. ఇప్పటికే 'మంగలాష్ తక్ వన్స్ మోర్' అనే చిత్రాన్ని నిర్మించి విజయం సొంతం చేసుకున్న రేణు దేశాయ్ తాజాగా ఆమె స్వీయ నిర్మాణ దర్శకత్వంలో 'ఇష్క్ వాలా లవ్' అనే మరాఠీ చిత్రం చేస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేస్తున్నారు.

ఇదొక బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరతో కూడిన డ్రామా. ఆదినాథ్ కొఠారి, సులగ్నా పానిగ్రాహి లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ చిత్రానికి 'ఖుషి' చిత్ర దర్శకుడు ఎస్.జె.సూర్య రెండు సాంగులను కంపోజ్ చేసాడు. గతేడాది అక్టోబర్ 10న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ మధ్య ప్రకటించినా....ఇప్పటికీ విడుదల కాలేదు.

English summary
Renu has come up with a big question which goes like this - 'Do US citizens & media go as super crazy & bonkers when our PM visits their country?'
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu