»   » పవన్ క్యారెక్టర్ చనిపోవాల్సింది , మళ్ళీ రీమేక్ చేస్తాను: "జానీ" పై రేణూ దేశాయ్

పవన్ క్యారెక్టర్ చనిపోవాల్సింది , మళ్ళీ రీమేక్ చేస్తాను: "జానీ" పై రేణూ దేశాయ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్‌ కెరీర్‌లో అత్యంత భారీ డిజాస్టర్‌గా నిలిచింది 'జానీ' సినిమా. ఆ సినిమాకు పవన్‌ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఒరిజినల్‌ కథకు వాణిజ్య హంగులు జోడించడం వల్లే ఆ సినిమా ఫ్లాప్ అయ్యిందని రేణూ దేశాయ్ వెల్లడించింది.తాను గతంలో పవన్ సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌, కాస్ట్యూమ్‌ డిజైనర్‌, ఎడిటర్‌ గా విధులు నిర్వర్తించానని తెలిపింది. నిజానికి ఈ విషయం చాలామందికి తెలియదని పేర్కొన్న రేణూ దేశాయ్, ఎలాంటి గుర్తింపు కోరుకోకుండా పవన్‌ నటించిన సినిమాలకు పనిచేశానని తెలిపింది.

రేణూ పేరు వేయలేదు

రేణూ పేరు వేయలేదు

అలా పని చేసిన సినిమాల్లో ‘ఖుషి', ‘బాలు' సినిమాలు ఉన్నాయని చెప్పింది. ‘జానీ' సినిమాలో ఆమె పని చేసినట్టు టైటిల్స్ లో ప్రకటించారు. కానీ ‘ఖుషి', ‘బాలు' సినిమాల టైటిల్స్ లో రేణూ పేరు వేయలేదు. వాస్తవానికి ‘ఖుషి' సినిమాలోని ‘ఏ మేరా జహ' పాటను తానే ఎడిటింగ్‌ చేశానని రేణూ దేశాయ్ తాజాగా వెల్లడించింది.

ఇదే సినిమా గురించి

ఇదే సినిమా గురించి

అదే సందర్భం లో ఒక ప్రశ్నకు సమాధానం గా జానీ సినిమానూ గుర్తు చేసుకుంది. అమెరికా టూర్‌లో వున్నప్పుడు కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ జానీ సినిమా ప్ర‌భావం త‌న‌పై ఎలా వుందో వివ‌రించాడు. ఏడు సినిమాలు చేసి రిటైర్ అయిపోదామనుకున్నానని, ‘జానీ' సినిమా కాని సక్సెస్ అయ్యుంటే.. ఇక సినిమాలు వదిలేసేవాణ్ణ‌ని ప‌వ‌న్ చెప్పాడు. అయితే ఇదే సినిమా గురించి ఇప్పుడు మళ్ళీ రేణూదేశాయ్ మరిన్ని విషయాలు చెప్పింది.

భారీ డిజాస్టర్‌

భారీ డిజాస్టర్‌

పవన్‌ నటించిన సినిమాల్లో వేటిని రీమేక్‌ చేయాలనుకుంటున్నారు అనే ప్రశ్నకు స్పందిస్తూ.. వెంటనే ‘జానీ' అని చెప్పింది రేణు. నిజానికి పవన్‌ కెరీర్‌లో అత్యంత భారీ డిజాస్టర్‌గా నిలిచింది ‘జానీ' సినిమా. ఆ సినిమాకు పవన్‌ డైరెక్టర్‌ అనే విషయం తెలిసిందే. ఒరిజినల్‌ కథకు వాణిజ్య హంగులు జోడించడం వల్లే ఆ సినిమా ఆడలేదంటోంది రేణు.

అక్కడ రీమేక్ చేస్తానని అంటోంది

అక్కడ రీమేక్ చేస్తానని అంటోంది

ఒరిజినల్‌ కథ ప్రకారం ఆ సినిమా క్లైమాక్స్‌లో హీరో పాత్ర చనిపోవాలట. కానీ, కమర్షియల్‌ పర్పస్‌ కోసం కథ మార్చేశారట. ఇంకా, కథలో లేని చాలా మార్పులు చేశారట. ఒరిజినల్‌ కథనే తెరకెక్కించి ఉంటే సినిమా విజయవంతమయ్యేదేమో! అని అభిప్రాయపడింది రేణు. తన సొంత భాష మరాఠీలో సినిమాల నిర్మాతగా మారిన రేణూ జానీ సినిమాను అక్కడ రీమేక్ చేస్తానని అంటోంది. మరి తెలుగులో ప్లాఫ్ కదా.. అంటే, దానిలో మార్పులు చేస్తానని కమర్షియల్ గా తీర్చిదిద్దుతానంటోంది.

English summary
Among all the Power Star films, Johnny can be termed as biggest disaster till date. It is known that Pawan Kalyan directed the film apart from penning the script. Surpringly Pawan's ex- wife and heroine of Johnny, Renu Desai wants to remake the same film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X