Republic Movie first review: సాయిధరమ్ తేజ్, దేవ కట్టా కుమ్మేశారంటూ.. ట్వీట్లతో హంగామా

మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ చిత్రం ఇప్పుడు ప్రపంచంలోని తెలుగు ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నది. రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ వేడుకలో పవర్ ష్టార్ పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగం అటు సినీ వర్గాల్లోను, ఇటు రాజకీయ వర్గాల్లోను వివాదం రేపింది. అయితే ఈ చిత్రం అక్టోబర్ 1వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఇక సినిమాపై నాని చెప్పిన విషయాలు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాయి. ఇంతకు నాని రివ్యూ ఎలా ఉందంటే..

సాయిధరమ్ హాస్పిటల్‌లో ఉండగా..

సాయిధరమ్ హాస్పిటల్‌లో ఉండగా..

రిపబ్లిక్ మూవీ ఓ ప్రత్యేక పరిస్థితుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. రోడ్డు ప్రమాదంలో సాయిధరమ్ తేజ్ గాయపడి అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ రిలీజ్‌కు సిద్దమైంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు అండగా ఉండాలని పవన్ కల్యాణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చారు.

 ఏపీలో టికెట్ల అమ్మకాల వివాదం నేపథ్యంలో

ఏపీలో టికెట్ల అమ్మకాల వివాదం నేపథ్యంలో

ఏపీలో టికెట్ల అమ్మకాలు, థియేటర్లలో సినిమాల ప్రదర్శన అంశాల విషయంలో వివాదం నెలకొన్న సమయంలో రిపబ్లిక్ చిత్రం రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో టికెట్ల అమ్మకాల విషయంలో ఏపీ ప్రభుత్వ తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం సృష్టించాయి.

ప్రభుత్వాలు, సీఎంల అవినీతిపై విమర్శనాస్త్రంగా

ప్రభుత్వాలు, సీఎంల అవినీతిపై విమర్శనాస్త్రంగా

ఇక రిపబ్లిక్ సినిమా విషయానికి వస్తే.. ప్రభుత్వాల అవినీతిపై విమర్శనాస్త్రంగా ఈ సినిమా తెరకెక్కింది. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఐఏఎస్ అధికారికి జరిగిన సంఘర్షణే ఈ చిత్ర కథ అనే విషయం మీడియా వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ప్రజా సంక్షేమానికి కట్టుబడాల్సిన ప్రభుత్వాలను నిలదీసిన ఐఏఎస్ అధికారి పాత్రలో సాయిధరమ్ తేజ్ నటించడం విశేషంగా మారింది.

దేవ కట్టా దర్శకుడిగా...

దేవ కట్టా దర్శకుడిగా...

గ్రామ రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు లాంటి అంశాలతో ప్రస్థానం లాంటి సినిమాను తెరకెక్కించిన దేవకట్టా రిపబ్లిక్ మూవీని రూపొందించారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఆసక్తిని రేపాయి. ఈ సినిమా కోసం ప్రేక్షకులను ఎదురు చూసేలా చేశాయి. ఈ క్రమంలో బుధవారం రాత్రి సినీ ప్రముఖులకు రిపబ్లిక్ మూవీని ప్రత్యేక ప్రదర్శన ద్వారా చూపించారు. ఈ ప్రీమియర్ షోకు, నాని, సింగర్ స్మిత తదితరులు హాజరయ్యారు.

నాని సినిమా చూసి.. తన రివ్యూను..

నాని సినిమా చూసి.. తన రివ్యూను..

రిపబ్లిక్ సినిమా చూసిన తర్వాత నాని ట్విట్టర్‌లో స్పందిస్తూ.. తన చుట్టు ఉంటే వ్యక్తులపై సాయిధరమ్ చూపించిన ప్రేమానురాగాలే ఆయనను మళ్లీ రిపబ్లిక్ సినిమా రూపంలో చూసేలా చేశాయి. ఆయన బలంగా మళ్లీ ప్రేక్షకుల వద్దకు చేస్తున్నాయి. సాయిధరమ్ కమ్ బ్యాక్ గురించి దర్శకుడు దేవాకట్టా బల్లగుద్ది చెప్పబోతున్నాడు. అద్భుతమైన విజయాన్ని అందుకోబోతున్న చిత్ర యూనిట్‌కు నా కంగ్రాట్స్ అంటూ నేచురల్ స్టార్ నాని ట్వీట్ చేశారు.

Recommended Video

Sanjana Galrani About Swarna Khadgam Serial | Interview Part 2
ట్విట్టర్‌లో సింగర్ స్మిత ట్వీట్ చేస్తూ..

ట్విట్టర్‌లో సింగర్ స్మిత ట్వీట్ చేస్తూ..

రిపబ్లిక్ సినిమా గురించి సింగర్ స్మిత ట్వీట్ చేస్తూ.. రిపబ్లిక్ సినిమా దేవకట్టాకు కొత్త ప్రస్థానం. రాత్రి ఈ సినిమా చూశాను. మైండ్ బ్లోయింగ్‌ అనే ఫీలింగ్ కలిగింది. సాయిధరమ్ తేజ్ కెరీర్‌లోనే ది బెస్ట్ సినిమా. రిపబ్లిక్ సినిమా రాజకీయాలకు అతీతంగా.. ప్రతీ ఒక్కరు అనుభవించాల్సిన అనుభూతి. ఇంకా ఆ సినిమా కలిగించిన హ్యాంగోవర్ నుంచి ఇంకా బయటపడలేదు. మీరు నుంచి ఎలాంటి స్పందన వస్తుందో అనే విషయం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని స్మిత తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X