»   » ఆ వార్త విని అంతా షాక్: రేష్మి స్పందన, మేం విడిపోలేదని ప్రకటన!

ఆ వార్త విని అంతా షాక్: రేష్మి స్పందన, మేం విడిపోలేదని ప్రకటన!

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: సినీ తారల విడాకుల వ్యవహారాలు ఒకప్పుడు ఎక్కవగా బాలీవుడ్లోనే కనిపించేవి. ఈ మధ్య కాలంలో సౌత్ సినీ పరిశ్రమలో కూడా ఇవన్నీ కామన్ అయ్యాయి. ఇటీవల కాలంలో ప్రముఖ హీరోయిన్ అమలా పాల్, రజనీకాంత్ కూతురు సౌందర్య విడాకుల వ్యవహారాలే ఇందుకు నిదర్శనం.

  తాజాగా ఇలాంటిదే మరో షాకింగ్ న్యూస్. సౌత్ హీరోయిన్ రేష్మి మీనన్, నటుడు బాబీ సింహ ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పట్టుమని పది నెలలు కూడా గడవక ముందే వీరు విడిపోతున్నట్లు తమిళ మీడియాలో వార్తలొచ్చాయి.

  ఈ వివ్యహారంపై రేష్మి మీనన్ వెంటనే స్పందించారు. ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. 'నాకు రూమర్ల మీద స్పందించే అలవాటు లేదు. కానీ ఇటీవల ఓ రూమర్ నన్ను బాగా బాధించింది. మేం విడిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాంటిదేమీ లేదు. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఆ వార్తలను నమ్మవద్దు' అంటూ ఆమె ట్వీట్ చేసారు.

  ప్రేమ వివాహం

  ప్రేమ వివాహం

  బాబీ సింహా, రేష్మి ఇద్దరూ సినీ పరిశ్రమకు చెందిన వారే. ఓ సినిమాలో ఇద్దరూ కలిసి నటించారు. అలా ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఏప్రిల్ 22, 2016న వీరి వివామం తిరుపతిలో గ్రాండ్ గా జరిగింది.

   ఆర్భాటాలు లేకుండానే

  ఆర్భాటాలు లేకుండానే

  అప్పట్లో వీరి వివాహ వేడుక వెంకన్న సన్నిధిలో చాలా సింపుల్ గా జరిగింది. తిరుమలలో పెళ్లి వేడుక జరుగడంతో కుటుంబ సభ్యులు, కొందరు మిత్రులు మాత్రమే హాజరయ్యారు. వివాహ వేడుక సింపుల్ గా జరిగింది.

  తర్వాత గ్రాండ్ గా వెడ్డింగ్ పార్టీ

  తర్వాత గ్రాండ్ గా వెడ్డింగ్ పార్టీ

  పెళ్లి జరిగిన రెండు రోజులకే 24న చెన్నైలో గ్రాండ్‌గా వెడ్డింగ్ రిసెప్షన్ జరుగింది. ఈ వెడ్డింగ్ రిసెప్షన్‌కు సినీ రంగానికి చెందిన ప్రముఖులందరినీ ఆహ్వానించారు ఈ జంట. ప్రముఖులంతా వచ్చి ఈ దంపతులను ఆశీర్వదించారు.

  ఇబ్బంది ఎదురైనా మొత్తానికి ఒప్పించారు

  ఇబ్బంది ఎదురైనా మొత్తానికి ఒప్పించారు

  ఇద్దరూ పెళ్లికి ముందు నుండే ప్రేమించుకుంటున్నారు. తొలుత వీరి పెళ్లికి పెద్దల నుండి కాస్త ఇబ్బందులు ఎదురైనా....వారిని ఒప్పించి పెళ్లితో ఏకమయ్యారు.

   హ్యాపీ కపుల్

  హ్యాపీ కపుల్

  పెళ్లి తర్వాత ఈ జంట హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. పెళ్లి తర్వాత కూడా రేష్మీ మీనన్ కొన్ని సినిమాల్లో

  బాబీ తెలుగులో చేసాడు

  బాబీ తెలుగులో చేసాడు

  ఇటీవల సందీప్ కిషన్ మూవీ 'రన్' ద్వారా బాబీ సింహా విలన్‌గా టాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా ఆడక పోవడంతో ఈ స్టార్ మళ్లీ తెలుగులో నటించలేదు.

   రేష్మి కూడా

  రేష్మి కూడా

  రేష్మి కూడా తెలుగు సినిమాలు చేసింది. 'హైదరాబాద్ లవ్ స్టోరీ' అనే తెలుగు సినిమాలో నటిస్తోంది. ఈచిత్రంలో ఆమె రాహుల్ రవీంద్రన్ తో కలిసి నటిస్తోంది. ఈ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు.

  English summary
  Kollywood media was abuzz with reports that married acting couple Bobby Simha and heroine Reshmi Menon are all set to break up. Surprisingly they got married in April this year. Reacting on the same, Reshmi took to social media to write, "Not reacting for rumours but 4 all those concerned ones calling us..We Are Happily Married..The only thing we will be splitting is pizza", refuting all the rumours.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more