»   » ఈ నెల 22న బాబీ సింహా-రేష్మి ప్రేమ వివాహం (ఫోటోస్)

ఈ నెల 22న బాబీ సింహా-రేష్మి ప్రేమ వివాహం (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా రంగంలో ప్రేమవివాహాలు సర్వసాధారణమే. తాజాగా ఇదే బాటలో మరో సినీ జంట నడుస్తోంది. గత కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న నటుడు బాబీ సింహా, నటి రేష్మి మీనన్‌ పెళ్లికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 22న తిరుపతిలో వీరి వివాహం కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో జరుగబోతోంది.

దీని గురించి బాబీ సింహా మాట్లాడుతూ 'కుటుంబ సభ్యులు, ఆప్త మిత్రులు సమక్షంలో తిరుపతి వెంకటేశ్వరుడిని సన్నిధిలో మా వివాహం జరుగుతుంది. చెన్నైలో గ్రాండ్ గా వెడ్డింగ్ రిసెప్షన్ ప్లాన్ చేస్తున్నాం. ఈ వెడ్డింగ్ రిసెప్షన్‌కు సినీ రంగానికి చెందిన ప్రముఖులందరినీ ఆహ్వానిస్తామని తెలిపారు.

గతేడాది నవంబర్‌లో బాబీ సింహా, రేష్మి ఎంగేజ్మెంట్ జరిగింది. ఏప్రిల్ 17 నుండి పెళ్లి సందడి మొదలు కానుంది. 17న చెన్నైలో సంగీత్ సెలబ్రేషన్స్, ఆ తర్వాత మొహందీ వేడుక జరుగబోతోంది. ఏప్రిల్ 24న చెన్నైలో గ్రాండ్ గా రిసెప్షన్ జరుగబోతోంది.

తమిళంలో బాబీ సింహా, రేష్మి కెరీర్ బాగా సాగుతోంది. ఇటీవల సందీప్ కిషన్ మూవీ 'రన్' ద్వారా బాబీ సింహా విలన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం ఆయన చేతిలో కో 2, ఇరవి, పాంభు సత్తై, మెట్రో, వల్లవనుక్కు వల్లవన్, కావాలయ్ వేండమ్ తదితర చిత్రాల్లో నటిస్తున్నారు. రేష్మి 'హైదరాబాద్ లవ్ స్టోరీ' అనే తెలుగు సినిమాలో నటిస్తోంది. ఈచిత్రంలో ఆమె రాహుల్ రవీంద్రన్ తో కలిసి నటిస్తోంది. ఈ ఇద్దరు కలిసి ఉరుమీన్ అనే చిత్రంలో కలిసి నటించారు కూడా.

స్లైడ్ షోలో రేష్మి, బాబీ సింహా ఫోటోస్..

ఎంగేజ్మెంట్

ఎంగేజ్మెంట్

రేష్మి-బాబీ సింహా ఎంగేజ్మెంట్ ఫొటోస్..

కలిసి నటించారు

కలిసి నటించారు

ఇద్దరు ఉరుమీన్ అనే చిత్రంలో కలిసి నటించారు కూడా.

ప్రేమ వివాహం

ప్రేమ వివాహం

చాలా కాలంగా ఇద్దరూ కలిసి డేటింగ్ చేస్తున్నారు. పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు.

సూపర్ జోడీ

సూపర్ జోడీ

ఈ ఇద్దరి జోడీ చాలా బావుందని, చూడముచ్చటైన జంట అని అంటున్నారు ఫ్యాన్స్.

English summary
Bobby Simha is one of the young tamil actors who acted with Actress Reshmi Menon in the movie Urumeen. Reshmi Menon Marriage with Bobby Simha is coming soon. The sangeet ceremony will happen in Chennai on April 17, while a grand reception will be held in the city on 24th.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu