»   » సంజయ్ దత్‌కు శిక్ష వేసిన జడ్జి ఇపుడు బాలీవుడ్ యాక్టర్

సంజయ్ దత్‌కు శిక్ష వేసిన జడ్జి ఇపుడు బాలీవుడ్ యాక్టర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ అక్రమ ఆయుధాల కేసులో ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయనకు శిక్ష విధించింది జస్టిస్ పి.డి.కోడే. గతేడాది ఆయన హైకోర్టు జడ్డిగా పదవి విరమణ చేసారు. రిటైర్డ్ జడ్జిలు సాధారణంగా న్యాయ శాఖకు సంబంధించిన విభాగాల్లోనే కొనసాగుతారు. కానీ కోడే మాత్రం.... బాలీవుడ్ సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసారు. ప్రస్తుతం ఆయన ‘జే.డి' అనే సినిమాలో నటిస్తున్నారు. ఒక జర్నలిస్టు జీవితంలో ఎదురైన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కోడే.... న్యాయమూర్తి పాత్రలో నటిస్తున్నారు. అన్నట్లు కోడే తన నటనతో యూనిట్ సభ్యులను ఆశ్చర్య రుస్తున్నాడట.

Retired Justice P.D Kode shoots for Bollywood film J.D

సంజయ్ దత్ కేసు విషయానికొస్తే..
1993 బాంబు పేలుళ్ల కేసులో సంజయ్ దత్ పూణెలోని ఎరవాడ జైలులో గడుపుతున్న సంగతి తెలిసిందే. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడనే అభియోగం రుజువు కావడంతో టాడా కోర్టు సంజయ్ దత్‌కు ఆరేళ్ల కారాగార శిక్ష విధించింది. టాడా కోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తూ శిక్షను మాత్రం ఐదేళ్లకు తగ్గించింది.

రెండు దశాబ్దాల క్రితం సంజయ్ దత్ 18 నెలల పాటు జైలులో ఉన్నాడు. దాంతో మిగిలిన 42 నెలలు సంజయ్ దత్ కారాగార శిక్ష అనుభవించాలని సుప్రీంకోర్టు మార్చి 21, 2013న తేదీన తీర్పు చెప్పింది. సంజయ్ దత్ మే 16, 2013న తేదీన ముంబై కోర్టులో లొంగిపోయారు. ఆ తర్వాత ఆయనను పూణేలోని యెరవాడ జైలుకు తరలించారు.

English summary
Film J.D makes history. Its the first time in Bollywood industry, that a Real life Justice PD Kode, who presided over the 1993 blast trial, is entering reel life by agreeing to act in Producer- Director Shailendra Pandey's upcoming movie J.D which is based on the life of a journalist.
Please Wait while comments are loading...