»   » మరో హీరోయిన్ డైవర్స్: కారణం భర్త అక్రమ సంబంధమేనా?, ఇంకేదైనా..

మరో హీరోయిన్ డైవర్స్: కారణం భర్త అక్రమ సంబంధమేనా?, ఇంకేదైనా..

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొచ్చి: రీసెంట్ గా సినీ వర్గాల్లోనే కాక అంతటా హాట్ టాపిక్ గా మారిన అంశం..అమలా పాల్ విడాకులు. అదే తరహాలో ఇప్పుడు మరో మాజీ హీరోయిన్ తన భర్త నుంచి విడిపోతోంది. ఆమె ఎవరో కాదు మళయాళి నటి, డాన్సర్ అయిన దివ్య ఉన్ని. ఆమె తన భర్త డాక్టర్ సుధీర్ సుధాకరన్ నుంచి విడిపోతోంది.

దాదాపు 14 సంవత్సరాల వైవాహిక జీవితానంతరం విడిపోవటంతో ఇప్పుడు మళయాళి సిని పరిశ్రమలో ఇదే విషయం చర్చనీయాంశంగా మారింది. విడిపోవటానికి కారణం...భర్త సుధీర్ అక్రమ సంభంధమే అంటూ మీడియాలో వార్తలు సైతం వచ్చాయి. అయితే అందులో ఎంతవరకూ నిజముందో తెలియరాలేదు కానీ ఇప్పుడు మరో కారణం అందిరనీ ఆశ్చర్యపరుస్తోంది.

అది మరేదో కాదు..అమలా పాల్ తరహాలోనే దివ్య ఉన్ని కూడా తన తకెరీర్ విషయంలో తీసుకున్న నిర్ణయమే ఆమెను డైవర్స్ వైపుగా నడిపించి అంటున్నారు. ఇలా సిని పరిశ్రమకు చెందిన రెండు వివాహాలు దాదాపు ఒకే కారణంతో ఒకే సమయంలో వీగిపోవటం అందరినీ విస్మయపరుస్తోంది. భర్త ఇగోని తట్టుకోలేకే ఆమె విడాకులు తీసుకోబోతోందని చెప్తున్నారు.

స్లైడ్ షోలో మరిన్ని విశేషాలు..అసలు నిజం ఏమిటి

డాన్స్ పై మక్కువతో

డాన్స్ పై మక్కువతో

దివ్య ఉన్నికి డాన్స్ పై ఉన్న ఆసక్తి,డాన్స్ స్కూల్ పెట్టడం భర్తకి నచ్చలేదట

ఇంట్లోనే ఉండు

ఇంట్లోనే ఉండు

కెరీర్ అంటూ కుటుంబాన్ని పట్టించుకోవటం మానేస్తుందని, ఇంట్లోనే ఉండమని భర్త ఆదేశించాడట

కుటుంబం కోసం త్యాగం

కుటుంబం కోసం త్యాగం

తన కుటుంబం కోసం చాలా త్యాగాలు చేసానని, ఇక తన వల్ల కాదని దివ్య అంటోంది

కుదరదు

కుదరదు


డాన్స్ స్కూల్ మూసేయటం కుదరదని భర్తకు స్పష్టంగా చెప్పిందట

రెండు వైపులా

రెండు వైపులా

ఇరు వైపులకు చెందిన రెండు కుటుంబాల వారు...ఈ విషయంలో రాజికి రమ్మన్నా ఎవరూ తగ్గలేదట

కష్టం

కష్టం

అంత ఇగో ఉన్న భర్తతో కాపురం చెయ్యటం కష్టమని తెగేసి చెప్తోంది దివ్య ఉన్ని

పుట్టింటికి

పుట్టింటికి


భర్తతో ఆల్రెడీ విభేధించి తన సొంత ఊరుకి కొచ్చికి వచ్చేసింది ఆమె

తల్లితండ్రుల వద్దే

తల్లితండ్రుల వద్దే


తన తల్లితండ్రులతోనే ఉంటున్న ఆమెతో పాటు కొడుకు అర్జున్, కూతురు మీనాక్షి ఉన్నారు.

సినిమాల్లోకి

సినిమాల్లోకి

త్వరలోనే ఆమె తిరిగి సినిమాల్లోకి రాబోతోందని సమాచారం.

విడాకులు

విడాకులు

ఇద్దరూ విడాకులు కు అప్లై చేసారని, అఫీషియల్ గా విడిపోయినట్లే అంటున్నారు.

ఏడే ఏట నుంచే

ఏడే ఏట నుంచే


దివ్య ఉన్న తన ఏడో సంవత్సరం నుంచే సినిమాల్లో నటిస్తోంది. ఇలాంటప్పుడు ఆమెను నటనకు దూరం చెయ్యటం అన్యాయం అంటున్నారు

తమిల,తెలుగు

తమిల,తెలుగు

ఆమె అతి తక్కువ కాలంలోనే తమిళ,తెలుగు సినిమాల్లో నటించింది

తెలుగులో

తెలుగులో


వేణు హీరోగా వచ్చిన ఇల్లాలు..ప్రియురాలు చిత్రంలో హీరోయిన్ గా నటించింది

21 సంవత్సరాలకే

21 సంవత్సరాలకే

దివ్య వివాహం 21 సంవత్సరాల వయస్సులోనే ,ఇంట్లో వారు కుదర్చిన సంభంధం జరిగింది

అమెరికాలోనే

అమెరికాలోనే

తన భర్తతో అమెరికా వెళ్లిపోయిన ఆమె అక్కడే సెటిలై ,అక్కడో టీవి సీరియల్ సైతం చేసింది

English summary
Divya Unni, the popular actress-dancer recently parted ways with her husband, Dr. Sudhir Shekharan. The sources close to the actress have finally revealed the actual reason behind the couple's divorce.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X