»   » పవన్ కళ్యాణ్ గురించే ఫోస్ట్ ఫోనా?

పవన్ కళ్యాణ్ గురించే ఫోస్ట్ ఫోనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వస్తున్నాడంటూ మీడియాకు చెప్పేసారు. హడావిడి జరిగింది. ఆడియో తేదీకి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. అయితే ఫంక్షన్ జరగలేదు. నిన్న(జనవరి 5)న జరగాల్సిన రేయ్ ఆడియో ఫంక్షన్ వాయిదాపడింది. ఎందుకు ఏమిటనే కారణాలు తెలియలేదు. మీడియాకు సైతం కారణాలు తెలియరాలేదు. కేవలం ఆడియో ఫంక్షన్ లేదనే మాట మాత్రం చెప్పారు. దీనికి కారణం ..పవన్ కళ్యాణ్ దొరకకపోవటమే అంటున్నారు.

వేరే పనిలో బిజిగా ఉన్న పవన్ కళ్యాణ్...ఇచ్చిన మాట ప్రకారం ఆడియో పంక్షన్ హాజరు కాలేకపోతున్నాను అని చెప్పటంతో పవన్ లేకుండా ఆడియో పంక్షన్ ఎందుకని వాయిదా వేసారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. పవన్ ఆ ఆడియో ఫంక్షన్ కి వచ్చే కళే వేరు. అందరి దృష్టీ,ముఖ్యంగా మీడియా మొత్తం ఆ ఫంక్షన్ నే ప్రమోట్ చేయటంలో పోటీ పడుతుంది. తాజాగా పవన్ కళ్యాణ్ మరో ఆడియో వేడుకకు ఆ కళ తీసుకురావటానికి నిర్ణయించుకున్నాడు. ఆ సినిమా ... 'రేయ్‌'

Rey audio launch postponed

చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా నటించిన చిత్రం 'రేయ్‌'. సయామీఖేర్‌ హీరోయిన్ . వైవీఎస్‌ చౌదరి దర్శకత్వం వహించారు. చక్రి సంగీతం అందించారు. ఈ చిత్రంలోని గీతాల్ని ఈ నెల 5న విడుదల చేయనున్నారు. పాటల వేడుకకు ముఖ్య అతిథిగా పవన్‌ కల్యాణ్‌ హాజరు కానున్నారు.

దర్శకుడు మాట్లాడుతూ ''మా చిత్రానికి పవన్‌కల్యాణ్‌ అందిస్తున్న ప్రోత్సాహం మర్చిపోలేనిది. 'రేయ్‌' పాటల వేడుకకు ఆయన రాబోతుండడం... ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ నెల 4న ఏ టూ జెడ్‌ లుక్‌ని విడుదల చేస్తున్నాం. 11న ట్రైలర్‌ని చూపిస్తాం. బొమ్మరిల్లు పతాకంపై వచ్చిన సినిమాలోని పాటలన్నీ శ్రోతలను బాగా ఆకట్టుకొన్నాయి. 'రేయ్‌' పాటలూ అదే స్థాయిలో ఉంటాయి. చక్రి సమకూర్చిన సంగీతం, చంద్రబోస్‌ సాహిత్యం చక్కగా కుదిరాయి'' అన్నారు.

English summary
Sai Dharma Teja’s upcoming film ‘Rey’ directed by YVS.Chaudary Audio launch has been post-poned due to unknown reasons. Earlier the film makers have planned to release the audio on Jan 5th but due to some unknown reasons it has been post-poned and new release date will be announced soon. According to the makers of ‘Rey’, Powerstar Pawan Kalyan was supposed to attend the audio event. Siayami Kher and Shradda Das are playing female lead roles in this musical film. YVS Chowdary is producing this movie on Bommarillu Vaari banner
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu