»   »  రేయ్....రామ్ చరణ్ పుట్టినరోజుతో లింకు అందుకే!

రేయ్....రామ్ చరణ్ పుట్టినరోజుతో లింకు అందుకే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన యంగ్ హీరో సాయి ధరం తేజ్ ఇటివల 'రేయ్' ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ... మార్చి 27 సెంటిమెంట్ గురించి చెప్పాడు. మార్చి 27వ తేది నాడే తన తొలి ఫోటో సెషన్ జరిగిందని, మార్చి 27 తేది నాడే రేయ్ చిత్రం ప్రారంభం అయ్యిందని, ఇప్పుడు అదే మార్చి 27న తను నటించిన తొలి చిత్రం విడుదల కావడం సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నానని చెప్పాడు.

వీటితో పాటు మార్చి 27కి మరో సెంటిమెంట్ జత అయ్యింది. అది రామ్ చరణ్ పుట్టిన రోజు కావడం విశేషం, ఇంకా చెప్పాలంటే ఒక్క రోజు తేడా తో మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన అల్లు అర్జున్ ఫస్ట్ మూవీ‌తో లింక్ వుంది. అల్లు అర్జున్ నటించిన గంగోత్రి 2003 మార్చి 28న విడుదల కావడం మరో విశేషం. ఈ ఏడాది మార్చి 28న శ్రీ రామ నవమి. ఇది వై‌వి‌ఎస్ చౌదరి సెంటిమెంట్. అతని ఫస్ట్ మూవీ శ్రీ సీతా రాముల కళ్యాణం చూతము రారండి విడుదలైనరోజు. ఇలా రేయ్ చిత్రానికి అనుకోకుండా అన్ని మంచి శకునాలు సూచిస్తున్నాయి.


REY movie release on RamCharan birthday

రామ్ చరణ్ పుట్టిన రోజు నాడే ‘రేయ్' విడుదల చేయడం గల మీ ఆంతర్యం ఏమిటి అని దర్శక నిర్మాత వై వి ఎస్ చౌదరి ని అడగ్గా ... ఆయన స్పందిస్తూ 'దేవదాసు సినిమా రిలీజ్ అయిన రోజే మార్నింగ్ షో చూసి ఇంప్రెస్స్ అయిన నిర్మాత అశ్వనిదత్ గారు చిరంజీవిగారికి రామ్ చరణ్ గారికి స్పెషల్ షో ఏర్పాటు చేసి రామ్ చరణ్ తేజ్ ఇంట్రడక్షన్ ఫిలిం‌కి సబ్జెక్టు రడీ చేయమన్నారు. అలా రామ్ చరణ్ తేజ్ కోసం రడీ చేసిందే ఈ రేయ్ సబ్జెక్టు, కొన్ని పరిణామాల తరువాత సాయి ధరం తేజ్‌తో రేయ్ సినిమా తీయటం అంతా యాదృచ్చికం. రేయ్ ప్రాజెక్ట్ విషయం లో చిరంజీవి, పవన్ కళ్యాణ్ గార్ల మేనల్లుడు హీరో కాబట్టి మెగా అభిమానులను అలరించటానికి ఈ చిత్రం లో చిరంజీవి గారి ‘దొంగ' చిత్రం లోని సూపర్ హిట్ సాంగ్ ‘గోలీమార్'ను రీమిక్స్ చేసాము. అలాగే పవన్ కళ్యాణ్ గారికి ట్రిబ్యూట్ గా పవనిజం సాంగ్ ను రికార్డు చేసి ప్రత్యేకం గా షూటింగ్ చేసాము. రామ్ చరణ్ పుట్టిన రోజైన మార్చి 27న మెగా అభిమానులకు కానుక గా రిలీజ్ చేయడం కూడా కాకతాళీయం‌గా జరిగిందే .' అని అన్నారు.

English summary
Megastar nephew Sai Dharam Tej debut film ‘Rey’ is ready for release.The movie release has been delayed several times due to financial problems.Producer YVS chowdary cleared all the financial problems and movie will release on March27. Rey is action romantic love story movie.Saidharamteja playing role of west-indies guy. Sayami Kher and Shraddha Das will be seen as the female leads in this film and Shraddha Das characterisation is set to have negative shades. Chakri has composed the music for this film.
Please Wait while comments are loading...