»   »  ‘రేయ్ విత్ పవనిజం’ పోస్టర్లతో హడావుడి!

‘రేయ్ విత్ పవనిజం’ పోస్టర్లతో హడావుడి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సాయి ధరమ్ తేజ్ తొలి సినిమా ‘రేయ్' షూటింగ్ సమయంలోనే చాలా సమస్యలు ఎదుర్కొంది. షూటింగ్ పూర్తి కావడానికి దాదాపు మూడేళ్లకు పైగా సమయం పట్టింది. షూటింగ్ పూర్తయినా...వివిధ కారణాలతో సంవత్సర కాలంగా విడుదలకు నోచుకోవడం లేదు. ఎట్టకేలకు ఈచిత్రాన్ని మార్చి 27న విడుదల చేసేందుకు రంగం సిద్దమైంది.

ఈ చిత్రానికి నిర్మాత, దర్శకుడు అయిన వైవిఎస్ చౌదరి సినిమాకు మంచి ఓపెనింగ్స్ రాబట్టేందుకు తన శక్తిమేర ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం పవన్ కళ్యాణ్ పేరును సినిమా ప్రచారం కోసం వాడుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ‘రేయ్' మూవీపై స్పెషల్ సాంగ్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ‘రేయ్ విత్ పవనిజం' పోస్టర్లు కూడా రిలీజ్ చేసారు.

 Rey Pawanism Posters

పవన్ కళ్యాణ్ ఆశీస్సులతోనే ‘రేయ్' మూవీ మొదలైన నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ ను ఆకట్టుకోవడానికి ఈ అంశాన్ని ఓ సాధనంలా వాడుకోబోతున్నాడు వైవిఎస్ చౌదరి. స్పెషల్‌గా పవనిజం సాంగును విడుదల చేస్తున్నారు. ఈ సాంగును మార్చి 14న అఫీషియల్ గా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ రోజుకు ఓ ప్రత్యేకత ఉంది. ఇదే రోజు పవన్ కళ్యాన్ జనసేన పార్టీ ఆవిర్భవించిన రోజు. ఈ పాటను ప్రముఖ సినీగేయరచయిత చంద్రబోస్ రాసారు. దివంగత సంగీత దర్శకుడు చక్రి ఈ సాంగును కంపోజ్ చేసారు.

 Rey Pawanism Posters

మరో విశేషం ఏమిటంటే.... ‘రేయ్' మూవీ విడుదల తేదీ అయిన మార్చి 27 రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ సినిమా వైపు ప్రేక్షకులను లాగడానికి చౌదరి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో ఈ విషయాలు గమనిస్తే ఇట్టే తెలిసి పోతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓపెనింగ్స్ వరకే.... సినిమా ప్రేక్షకులకు ఏ మేరకు నచ్చుతుంది అనే దానిపైనే జయాపజయాలు ఆధారపడి ఉంటాయనేది వాస్తవం.

English summary
YVS Chowdary directional 'Rey' all set to release in march last week. Chowdary using pawan name to create some hype.As part of that, movie team is releasing 'Pawanism' song on this 14th.
Please Wait while comments are loading...