»   » నాగార్జున ఫ్యాన్సే నన్ను తిట్టారు

నాగార్జున ఫ్యాన్సే నన్ను తిట్టారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :'అంతం' ఇంకా జనాలకు గుర్తుంటుందని అనుకోలేదు. ఎందుకంటే... అదొక ఫ్లాప్ సినిమా. ఆ రోజుల్లో ఆ సినిమా తీసినందుకు నాగార్జున ఫ్యాన్సే నన్ను తిట్టారు. కానీ ఆ సినిమా నాకు ఇష్టం అంటున్నారు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. మోహన్ బాబు తో రూపొందించిన 'రౌడీ' సినిమాలో 'అంతం'లోని ఓ సీన్‌ను యథాతథంగా కాపీ కొట్టేశారనే విషయపై ఆయన ఇలా స్పందించారు. ఆయన దర్శకత్వం వహించిన 'ఐస్‌క్రీమ్' చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది.

రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ... ఈ విషయంలో మీతో నేను ఏకీభవిస్తున్నా. అంతంలోని ఆ సీన్ ఈ జనరేషన్‌కి పరిచయం చేయాలనుకున్నాను. కానీ... ఒక్కటి మాత్రం నిజం. నేను కష్టపడే విషయంలో తేడా ఉండదు. కానీ.. చుట్టూ ఉన్నవారి ప్రభావం కూడా నాపై ఉంటుంది. నేను ఏం తీసినా బావుంది అనడం వల్ల వస్తున్న సమస్యలివన్నీ. అలాంటి వారి వల్ల కొన్ని ఫ్లాపుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అందుకే... ఇక నుంచి నేను తీసిన సినిమాలను నాకు సంబంధం లేని ఓ పది మందికి చూపించిన తర్వాతే విడుదల చేయాలనుకుంటున్నా అన్నారు.

RGV about his Antham movie

రామ్‌గోపాల్‌ వర్మ అంటే ఓ సంచలనం. ఆయన సినిమాలు చేసినా చేయకపోయినా అది వార్త అయి కూర్చుంటుంది. ఆఖరికి ఆయన పెట్టిన సినిమా పేర్లు కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు ఆయన నుంచి రాబోతున్న సినిమా పేరు 'ఐస్‌క్రీమ్‌'. నవదీప్‌ హీరో. 'సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్లు', 'హార్ట్‌ఎటాక్‌','మనం' సినిమాలో చలాకీ అమ్మాయిగా కనిపించిన తేజస్వి హీరోయిన్. తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మాత. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. వర్మ శైలికి భిన్నంగా ఈ సినిమా ఉండబోతోందని సమాచారం. ఇందులో తొలిసారిగా వర్మ 'ఫ్లో కెమెరా' అనే నూతన పరిజ్ఞానాన్ని వినియోగించానని చెప్తున్నారు.

దర్శకుడు మాట్లాడుతూ ''సినిమా కోసం దేశంలోనే తొలిసారిగా ఫ్లో కెమెరా పరిజ్ఞానాన్ని వినియోగించాం. సినిమాలో హీరోయిన్ తేజస్వి కొన్ని సన్నివేశాల్లో నగ్నంగా కనిపిస్తుంది. చిత్రంలో ఈ సన్నివేశాలకు ప్రాధాన్యముంది. అంతేగాని ఇరికించినవి కావు'' అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ ''పరిశ్రమకు కొత్తదనాన్ని తీసుకురావడం వర్మకే చెల్లింది. ఫ్లోకామ్‌ పరిజ్ఞానంతో 20 నిమిషాల సన్నివేశాలు చూసి అందరూ ఆశ్యర్యపోతున్నారు'' అన్నారు.

టైటిల్‌కు తగ్గట్లుగానే వర్మ ఇప్పటివరకూ తీసిన చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. 'ఐస్‌క్రీమ్' చిత్రానికున్న మరో ప్రత్యేకత ఏమిటంటే.. తన మొదటి సినిమా 'శివ'తో స్టడీకామ్ కెమెరాను పరిచయం చేసిన రాము తాజాగా ఈ చిత్రంలో ఫ్లోకామ్ అనే కెమెరాను ఉపయోగించారు. దీనిని ఆసియాలోనే తొలిసారిగా ఉపయోగించిన దర్శకుడు వర్మ అని చెప్పాలి. ఫ్లోకామ్‌తో చిత్రీకరించిన సన్నివేశాలను చూసిన ప్రేక్షకులు సరికొత్త అనుభూతి పొందుతారని యూనిట్ సభ్యులు చెప్పారు.

English summary
Ram Gopal varma remembers his Antham Movie Scene and he said that he used that in Rowdy movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu