twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బూచి' ని 3డిలో ఎందుకు తీసానంటే : వర్మ

    By Srikanya
    |

    హైదరాబాద్ : త్రీడీ దృశ్యం ప్రేక్షకులపై చూపే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సంఘటనలు మన మధ్య జరిగినట్టు అనిపిస్తుంటాయి. అందుకే త్రీడీలో ఈ చిత్రాన్ని తీశాను. ఇక భయపడతారా లేదా అనేది తరవాతి సంగతి అన్నారు రామ్ గోపాల్ వర్మ. ఈసారి త్రీడీలో భయపెడతానంటున్నారు రామ్ గోపాల్ వర్మ. 'భూత్‌ రిటర్న్స్‌' పేరుతో ఇటీవల ఓ చిత్రం తీశారు. అది 'బూచి'గా తెలుగులోకి అనువాదమైంది. శుక్రవారం ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్బంగా మీడియాతో వర్మ మాట్లాడారు.

    'బూచి' చిత్రం పిల్లలతో పెద్దవాళ్లను భయపెట్టించేందుకు తీశాను. అమాయకంగా కనిపించే చిన్న పిల్లల ద్వారా భయపెట్టిస్తే ఆ ప్రభావం పెద్దలపై తీవ్రంగా ఉంటుంది. ఆ ఆలోచన నుంచి పుట్టిన చిత్రమిది. ఓ వర్గం ప్రేక్షకులు ఈ తరహా చిత్రాల్ని ఇష్టపడుతుంటారు. హారర్‌ సినిమాకెళ్లడం.. జెయింట్‌ వీల్‌ ఎక్కడం... రెండూ ఒకటే. సాధారణంగా జెయింట్‌ వీల్‌ ఎక్కి కూర్చున్నాక అది కిందకొచ్చేటప్పుడు బాగా భయపడతారు. ఆ తర్వాత కొద్ది క్షణాలపాటు ఆ భయమే మనకి ఒక తెలియని ఆనందాన్నిస్తుంది. ఆ ఆనందాన్ని కోరుకొనేవాళ్లే జెయింట్‌ వీల్‌ని ఎక్కుతుంటారు. హారర్‌ సినిమా కూడా అంతే. అందులో ఒక సన్నివేశంలోనూ, పాటలోనూ భయపడినా... ఆ తర్వాత ప్రేక్షకుడు ఓ రకమైన సంతోషాన్ని పొందుతాడు అన్నారు.

    అలాగే చిన్నప్పట్నుంచి తనకు భయపెట్టడమంటే ఇష్టం అని, తలుపులు వెనకాల దాక్కుని.. 'బూ..' అంటూ భయపెట్టేవాడ్నని రాము అన్నారు. ఒక చిన్నపిల్ల వల్ల పెద్దవాళ్లు భయపడితే ఎలా ఉంటుంది? అని 'బూచి'లో చూపించానని, తను చేసిన తొలి 3డి చిత్రం ఇది అని కూడా ఆయన చెప్పారు.

    మన దగ్గర అలాంటి సినిమాలు పెద్దగా రాలేదు. బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినిమా 'జగమేమాయ' చూసి భయపడ్డాను. ఇలాంటివి తమిళం నుంచి ఎక్కువగా అనువాదమై వచ్చేవి. హిందీలో రామ్‌సే బ్రదర్స్‌ సినిమాలూ చూసేవాణ్ని. ఇప్పటికీ నాకు నచ్చిన చిత్రం 'ది ఎగ్సార్జిస్ట్‌'. ఈ చిత్రం చూసి మీరు భయపడ్డారా? అని మీడియా వారి ప్రశ్నకు సమాధానంగా 'నేనే పెద్ద దెయ్యాన్ని' అంటూ రాము తనదైన శైలిలో సమాధానం చెప్పారు.

    జేడీ మాట్లాడుతూ - ''మామూలుగా ఇలాంటి చిత్రాల్లో శబ్దాలు మనల్ని భయపెడతాయి. కానీ ఈ చిత్రంలో రాము సెలైంట్ సీన్స్‌లో కూడా భయపెట్టారు. సినిమా చేస్తున్నప్పుడు మాకు భయంగా అనిపించలేదు కానీ చూస్తున్నప్పుడు మాత్రం భయం వేసింది'' అన్నారు. వర్మతో తనకిది రెండో చిత్రం అని మనీషా చెప్పారు. మధుశాలిని కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆలుంబ్రా ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఈ చిత్రాన్ని జితేంద్రజైన్ నిర్మించారు.

    English summary
    Director Ram Gopal Varma’s upcoming film ’Bhoot Returns’, which is a sequel to his earlier film Bhoot released in 2003, is getting ready to hit the theaters on October 12th, 2012. RGV said that "This is my first film made in 3D format and I am very happy to announce that I releasing this film in Telugu also". The film has J D Chakravarthy, Manisha Koirala and Madhu Shalini in lead roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X