Don't Miss!
- News
నేటినుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం: రేపే బడ్జెట్ .. షెడ్యూల్ ఇలా!!
- Sports
INDvsNZ: టీమిండియాకు సంప్రదాయ వెల్ కమ్.. వీడియో షేర్ చేసిన బీసీసీఐ
- Finance
it news: TCS రికార్డుల మోత.. 22 కంపెనీలను వెనక్కి నెట్టి అగ్రస్థానం కైవసం
- Automobiles
ఎట్టకేలకు హైరైడర్ CNG విడుదల చేసిన టయోటా.. ధర ఎంతంటే?
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
కమ్మ రాజ్యంలో కడప రెడ్లు... బెజవాడలో కులాల కుంపటి రాజేస్తున్న ఆర్జీవీ!
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ త్వరలో 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అనే సినిమా తీయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎంగా అధికారంలోకి వచ్చిన వెంటనే వర్మ ఈ సినిమా ప్రకటించడం చర్చనీయాంశం అయింది. ఈ సినిమా ద్వారా వర్మ మళ్లీ కులాల కుంపట్లు రగుల్చుతున్నారని, కమ్యూనిటీల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ టీవీ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆర్జీవీ క్లారిటీ ఇచ్చారు. దీంతో పాటు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా గురించిన విషయాలు కూడా తెలిపారు.

‘లక్ష్మీస్ ఎన్టీఆర్' మూవీకి అక్కడి నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదు
‘లక్ష్మీస్ ఎన్టీఆర్' మూవీకి వైసీపీ నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదని వర్మ స్పష్టం చేశారు. మధ్యలో ఒకసారి హైదరాబాద్‌లో పార్క్ హయత్ హోటల్‌లో వైసీపీ నాయకుడు అనిల్ కుమార్ రెడ్డి నాతో మాట్లాడిన మాట నిజమే...కానీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రానికి ఎలాంటి సంబంధం లేదు. ఆయన మాట్లాడింది ‘జీసెస్ క్రైస్ట్' గురించి అని వర్మ స్పష్టం చేశారు.

‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' కులాల కుంపట్లు రగుల్చుతుందా?
‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అనే టైటిల్ కులాల కుంపట్లు రగిల్చే విధంగా ఉందనే వాదనను వర్మ తోసిపుచ్చారు. టీవీ ఛానల్స్ వారు ప్రతి రోజూ ‘కులం గురించి అడిగే వాడు అడ్డగాడిద' అని కొన్నేళ్లుగా వేస్తున్నారు. ఎవరైనా దాని గురించి పట్టించుకున్నారా? పట్టించుకోరు. అలాగే సినిమాలో చూపించేవి కూడా ప్రజలు పట్టించుకోరని వర్మ తెలిపారు. గొడవలు అనేవి కులాల మధ్య ఉండవు, కొన్ని గ్రూఫుల మధ్య ఉంటుందని తెలిపారు.

అందుకే అలాంటి టైటిల్ పెట్టాను
నేను విజయవాడలో చదువుకున్న రోజుల నుంచి అక్కడ ఎక్కువగా కమ్మ వారు మాత్రమే కనిపించేవారు. ఇపుడు రాయల సీమకు చెందిన చాలా మంది రెడ్లు అక్కడ కనిపిస్తుండటంతో విచిత్రంగా అనిపించింది. ఆ సంఘటనలనుంచి స్పూర్తి పొంది ఈ టైటిల్ పెట్టినట్లు వర్మ స్పష్టం చేశారు.

సినిమాలో ఏం చూపిస్తారు?
‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాలో ఏం చూపించబోతున్నారు? అనేది తాను ఇప్పుడే చెబితే మూవీపై జనాలకు ఇంట్రస్ట్ పోతుందని, సినిమా మొదలు పెట్టే క్రమంలో ఒక్కొక్క క్లూ ఇస్తానని ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ స్పష్టం చేశారు. ఇందులో అందరూ రాజకీయ నాయకులను చూపిస్తానని తెలిపారు.