»   » ‘కిల్లింగ్ వీరప్పన్’ లాంటి మూవీ ఇప్పటి వరకు రాలేదు: వర్మ

‘కిల్లింగ్ వీరప్పన్’ లాంటి మూవీ ఇప్పటి వరకు రాలేదు: వర్మ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సాధారణంగా ఏ సినిమాలో అయినా హీరోకు లవ్ స్టోరీ ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా ‘కిల్లింగ్ వీరప్పన్' మూవీలో విలన్‌కు లవ్ స్టోరీ ఉంది, హీరోకు లేదు. ఈ తరహా చిత్రం ఇప్పటి వరకు రాలేదు అని రామ్ గోపాల్ వర్మ చెప్పుకొచ్చారు. జనవరి 1న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న నేపథ్యంలో టీం మొత్తం ప్రచార కార్యక్రమాల్లో బిజీ అయిపోయారు. ఈ సినిమాపై వర్మ భారీ అంచనాలు పెట్టుకున్నారు

'కిల్లింగ్ వీరప్పన్' అన్ని లీగల్ సమస్యలను, సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని జనవరి 1న విడుదలకు సిద్దమవుతోంది. మూడు రాష్ట్రాల పోలీసులను ముప్పతిప్పలు పెట్టిన వీరప్పన్‌కు ఓ పోలీస్ అధికారి ఎలా చెక్ పెట్టాడు, అతన్ని పట్టుకోవడానికి ఎలాంటి వ్యూహాలు అమలు చేసాడు, చివరకు అతన్ని ఎలా మట్టుపెట్టాడు అనేది అసలు స్టోరీ. ఈ చిత్రంలో ఒకప్పుడు వీరప్పన్ చేతిలో కిడ్నాప్ అయిన కన్నడ సీనియర్ నటుడు రాజ్ కుమార్ తనయుడు శివరాజ్ కుమార్ హీరోగా నటిస్తున్నాడు.

RGV about Killing Veerappan

తన సినిమా గురించిన విశేషాలను ఆయన ట్వీట్ చేశారు. ఒక పోలీసు అధికారికి పుట్టిన ఆలోచన వల్లే వీరప్పన్ హతమయ్యాడని, ఆ అధికారికి సంబంధించిన కథే 'కిల్లింగ్ వీరప్పన్' సినిమా అని వర్మ తెలిపారు. 1200 మంది పోలీసులు కలిసి కూడా 15 ఏళ్ల పాటు వీరప్పన్‌ను పట్టుకోలేకపో యారని, భారత దేశ నేరచరిత్రలో పోలీసు శాఖ అతిపెద్ద వైఫల్యం అదేనని కూడా వర్మ వ్యాఖ్యానించారు.

'కిల్లింగ్ వీరప్పన్'ను మొట్టమొదట పోలీసులకే చూపిస్తానని, దానికి వాళ్ల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలని తనకు చాలా ఉత్సుకతగా ఉందని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చెప్పారు.

English summary
"Killing Veerappan will be the first film where the Villain has a love story and the Hero doesn't" RGV said.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu