»   » 'బెజవాడ రౌడీలు' టైటిల్ ని అలా మార్చటానికి వర్మ ఓకే

'బెజవాడ రౌడీలు' టైటిల్ ని అలా మార్చటానికి వర్మ ఓకే

Posted By:
Subscribe to Filmibeat Telugu

రాంగోపాల్‌వర్మ 'బెజవాడ రౌడీలు' టైటిల్ రోజు రోజుకీ వివాదమవుతున్న సంగతి తెలిసిందే. అయితే వర్మ చిరవకు పేరు మార్చటానికి ఒప్పుకున్నాడని అంటున్నారు.దర్శకుడు ఈ సినిమాకు 'బెజవాడ కుర్రోళ్లు' అని టైటిల్ పెడితే బావుంటుందని ప్రపోజల్ పెట్టినట్లు సమాచారం. అయితే ఆ పేరు బాగోలేదని వర్మ పేర్కొన్నట్లు సమాచారం. ప్రస్తుతానికి సినిమా టైటిల్‌ను 'బెజవాడ' అని నిర్ణయించినట్లు తెలిసింది. షూటింగ్ పూర్తయ్యాక టైటిల్‌పై తుదినిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఇక ఈ సినిమా కోసం జూలై 3 నుంచి నగరంలో డ్యూయట్‌ను చిత్రీకరించనున్నారు. అనుమతి కోసం పోలీస్ కమిషనర్ అమిత్‌గార్గ్‌కు వర్మ లేఖ రాశారు. సినిమా ప్రొడక్షన్ మేనేజర్ శనివారం అమిత్‌గార్గ్ డీసీపీ ఎం. రవీంద్రనాథ్‌బాబులకు పాటను వినిపించిన తర్వాత షూటింగ్ కు అనుమతి ఇవ్వనున్నట్లు తెలిసింది.

ఇటివలే మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ, కోనేరు కిరణ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో వివేక్ కృష్ణ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. నాగచైతన్య, జెనిలియా జంటగా నటిస్తున్న ఈ చిత్రం దసరా కు విడుదల కానుంది. ఇక ఏ టైటిల్ పెట్టినా జనం మాత్రం పాపులర్ అయిన బెజవాడ రౌడీలు అనే దానితో వ్యవహరిస్తారనేది మాత్రం నిజం.

English summary
RGV has agreed to delete the suffix of the title Rowdilu and retain Bejawada as the film’s title.The present schedule of the film is being shot in Hyderabad and a song has to be canned in Vijayawada in the next schedule.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu