'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే..' ఇందులో నిజమెంతో తెలియదు గానీ రాంగోపాల్ వర్మ మాటలకు మాత్రం అర్థం కచ్చితంగా వేరే ఉంటుంది. ట్వీట్ చూస్తే.. పొగడుతున్నట్లే ఉంటుంది. అందులో తిరకాసు చూస్తే దెబ్బేశాడే అనిపిస్తుంది. వర్మ ట్విట్టర్ సెటైర్ అలాంటిది.
కొంతకాలంగా పవన్ కల్యాణ్‌ను పొగుడుతున్నాడో.. విమర్శిస్తున్నాడో అర్థం చేసుకోలేని రీతిలో ట్వీట్స్ చేస్తూ వస్తున్న ఆయన.. తాజాగా మరో ట్వీట్ చేశారు. పవన్ తాజా చిత్రం 'అజ్ఞాతవాసి' పోస్టర్‌ను 'బహిరంగవాసి'గా చేసి పారేశాడు.
'అజ్ఞాతవాసి' సినిమాలోని ఓ పోస్టర్‌లో పవన్ ఫొటో ఉన్న స్థానంలో తన ఫొటోని చేర్చిన ఇమేజ్‌ను తాజాగా వర్మ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్టర్‌కి 'బహిరంగవాసి' అనే టైటిల్ పెట్టడం విశేషం.
క్షణాల్లో వైరల్:
ఈ పోస్టర్ వర్మ అభిమాని ఎవరైనా తయారు చేసి ఉండవచ్చు అని తెలుస్తోంది. 'బహిరంగవాసి' పేరుతో ఆయన షేర్ చేసిన ఫోటో క్షణాల్లోనే వైరల్ అయింది. కొద్దిసేపటికే లక్షల్లో లైక్స్ వచ్చాయి.
అడల్ట్ కంటెంట్‌తో:
ఆమధ్య 'ఎక్స్' పేరుతో షార్ట్ ఫిలిం చేస్తున్నట్లు ప్రకటించి దానికి సంబంధించిన బోల్డ్ పోస్టర్ తో వర్మ సంచలనం రేపిన సంగతి తెలిసిందే. మొన్నీమధ్యే కడప వెబ్ సిరీస్‌లో ఓ నటి చేత బూతులు పలికించి చాలామంది నోరెళ్లబెట్టేలా చేశాడు. చూస్తుంటే.. వర్మ అడల్ట్ కంటెంట్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టాడేమో అనిపిస్తోంది.
జీఎస్‌టీ:
ఇక వర్మ తాజాగా తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ 'గాడ్, సెక్స్&ట్రూత్'. న్యూడ్ గా సోఫాలో కూర్చొన్న ఓ మహిళ పోస్టరును విడుదల చేసి వర్మ మరో సంచలనానికి తెరలేపాడు. త్వరలోనే టీజర్ విడుదల చేస్తానని కూడా ప్రకటించాడు.
పోస్టరే ఇంత బోల్డుగా ఉంటే ఇక టీజర్ ఇంకెంత బోల్డుగా ఉంటుందోనన్న చర్చ మొదలైంది. చూడాలి మరి.. వర్మ ఇంకెన్ని సిత్రాలు చూపించబోతున్నాడో?
Ram Gopal Verma is known as a person with highest possible sense of humour and sensitivity. He doesn't really care about how people will take his move and tries to support his point of view without fail.
Story first published: Friday, January 12, 2018, 13:48 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more