»   » వర్మ మళ్లీ షాక్ ఇచ్చారు...ఈ సారి బడ్జెట్ విషయంలో

వర్మ మళ్లీ షాక్ ఇచ్చారు...ఈ సారి బడ్జెట్ విషయంలో

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో సంచలనానికి తెర తీసారు. తొలిసారిగా ఆయన ఇంటర్నేషన్ సినిమాను తెర కెక్కిస్తూ బడ్జెట్ విషయంలో అందరినీ ఆశ్చర్యపరిచారు. కొద్ది రోజుల క్రితం దాకా 'బాహుబలి' చిత్రమే ఇండియాలో భారీ బడ్జెట్ చిత్రమని అనుకున్నాం కానీ దానికన్నా ఎక్కువ బడ్జెట్ తో శంకర్ - రజనీల 'రోబో2.0' తెరకెక్కుతోంది. మరిప్పుడు వాటి రెండింటినీ మించి వర్మ ప్లాన్ చేస్తున్నారు.

రూ. 340 కోట్ల భారీ బడ్జెట్ తో 'నూక్లియర్' పేరుతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అమెరికా, చైనా, రష్యా, యెమెన్, భారత దేశాల్లో చిత్రీకరణ జరుపుతామని రాంగోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

RGV announces first international project NUCLEAR

చిత్రం వివరాల్లోకి వెళితే... అణు బాంబుల వల్ల సంభవించే విధ్వంసం పరిణామాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. అణుబాంబులు ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లి, మూడో ప్రపంచ యుద్ధం వస్తే ఎలా ఉంటుందో హెచ్చరిస్తూ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

'నూక్లియర్' సినిమా పోస్టర్ కూడా వర్మ విడుదల చేశారు. కాగా, అమితాబ్ బచ్చన్ ప్రధానపాత్రలో తెరకెక్కిస్తున్న 'సర్కార్ 3' సినిమా షూటింగ్ లో వర్మ ప్రస్తుతం బిజీగా ఉన్నారు.

రూ.340 కొట్ల భారీ బడ్జెట్ తో తన సినిమాని అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు రామ్ గోపాల్ వర్మ. ఆ సినిమా టైటిల్ 'న్యూక్లియర్'. ఈ విషయమై ఆయన ట్విట్టర్ లో పోస్టర్ వేసి , సినిమా గురించి రాసుకొచ్చారు.

ఈ సినిమా గురించి రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ 'నేనిప్పటి వరకూ ఫిక్షన్, నాన్ ఫిక్షన్ సబ్జక్ట్స్ చదివాను కానీ ఫస్ట్ టైమ్ న్యూక్లియర్ సబ్జెక్టు వైపు వెళుతున్నాను. ఇది ఇండియాలోనే భారీ బడ్జెట్ చిత్రం. ఎందుకంటే ఈ సబ్జెక్టు కి ఆ బడ్జెట్ కావాల్సిందే. ప్రస్తుతం ప్రపంచంలోనే ప్రతి మనిషి మెదడులో బలంగా ఉన్న సమస్య టెర్రరిజం' అన్నారు.


అలాగే 'ఒకవేళ టెర్రరిస్టుల చేతికి న్యూక్లియర్ బాంబు వెళ్లి అది ముంబై సిటీలో బ్లాస్ట్ అయితే మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుంది. ప్రపంచం నాశనమవుతుంది. అదే ఈ సినిమాలోని కథ' అన్నారు.

ఇకపోతే ఈ చిత్రాన్ని నిర్మించనున్న సిఎంఏ గ్లోబల్ సంస్థ 'చాలా డిస్కషన్ల తరువాత ఈ సబ్జెక్టు ని వర్మ అర్థం చేసుకున్న విధానాన్ని బట్టి ఆయన అయితేనే ఈ సినిమాకి సరోపోతారని నిర్ణయించుకున్నాం' అని తెలిపింది. ఇకపోతే ఈ చిత్రాన్ని అమెరికా, రష్యా, యమెన్, ఇండియా దేశాల్లో చిత్రీకరిస్తామని, ఇందులో ఇండియా, అమెరికా, చైనా, రష్యా నటులు నటిస్తారని వర్మ పేర్కొన్నారు.

English summary
Ram Gopal Varma today announced his first international project titled "NUCLEAR," which will be made at the whopping budget of Rs 340 crore.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu