»   »  వీరప్పన్ భార్యకు రామ్ గోపాల్ వర్మ స్ట్రాంగ్ కౌంటర్

వీరప్పన్ భార్యకు రామ్ గోపాల్ వర్మ స్ట్రాంగ్ కౌంటర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మ చిత్రం ''కిల్లింగ్ వీరప్పన్'' రిలీజ్ ఆపేయ్యాలని వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి పెట్టిన కేసు పెట్టిన సంగతి తెలిసిందే. తన భర్త ఎంతో మంచి వాడని....కానీ సినిమాలో చెడ్డ వాడిగా చిత్రీకరించారని ఆమె ఆరోపించారు. కేసులో ఆమె పేర్కొన్న అంశాలు డిఫరెంటుగా ఉన్నాయి.

లంచగొండి ప్రభుత్వం, నయవంచక ఆటవిక అధికారుల నుండి అడవులని సంరక్షించడానికి తన జీవితాన్ని ధారపోసిన వీరప్పన్ ని ఈ చిత్రంలో చెడ్డవాడిగా చూపబోతున్నారు, చాలా మంది తమిళులు వీరప్పన్ ని దైవ సమానుడిగా భావిస్తారు. ఈ చిత్రంలో వీరప్పన్ ని చూపించే విధానాన్ని బట్టి రెండు రాష్ట్రాల ప్రజల మధ్యన పెద్ద ఎత్తున గొడవలు జరుగుతాయి అంటూ ఆమె తన నోటీసుల్లో పేర్కొన్నారు.

అంతే కాకుండా......సెన్సార్ బోర్డు కూడా రామ్ గోపాల్ వర్మ తో చేతులు కలిపి నా భర్త కీర్తి ప్రతిష్టలను పాడు చెయ్యడానికి సిద్ధమవుతోంది అంటూ ఆమె తన నోటీసుల్లో పేర్కొన్నారు.

RGV answers Veerappan's wife

ముత్తు లక్ష్మి ప్రశ్నకు రామ్ గోపాల్ వర్మ సమాధానం ఇస్తూ...."ప్రతి బిడ్డ తన తల్లికి ముద్దొచ్చినట్టుగానే,ప్రతి భార్య తన భర్త మంచివాడనుకుంటుంది...ఒసామా బిన్ లాడెన్ భార్య ప్రకారం కూడా తన భర్త కన్నా మంచివాడు ప్రపంచంలోనే లేడు..ఇప్పుడు నా ప్రశ్నేంటంటే.. ఒసామా బిన్ లాడెన్,వీరప్పన్ కూడా మంచి వాళ్ళే అయితే మరి మహాత్మా గాంధీ గారి సంగతేంటి? అంటూ ప్రశ్నించారు.


ఈ సినిమా గురించి వర్మ గత ఇంటర్వ్యూల్లో చెప్పిన వివరాలు...
''చరిత్రలోనే వీరప్పన్‌ ఓ అరుదైన వ్యక్తి. వీరప్పన్‌ కథని సినిమాగా తీయడానికి చాలా పరిశోధన చేశాను. అతని భార్య ముత్తులక్ష్మిని కలుసుకొని కొన్ని విషయాలు సేకరించాను. వాటన్నింటిని క్రోడీకరించి తీసిన సినిమా ఇది. వీరప్పన్‌ తిరిగిన ప్రాంతాల్లోనే షూటింగ్ జరిపాము'' అని వర్మ అంటున్నారు.

''వీరప్పన్ చరిత్రను తెరకెక్కించాలని చాలా సంవత్సరాలుగా ఆసక్తిగా ఉన్నా. ఆయన్ను పట్టుకోవడానికి ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు ప్రభుత్వాలు దాదాపు 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాయి. చంపడానికి పోలీసులకు 20 ఏళ్లు పట్టింది. వీరప్పన్‌ను చంపడం అనే పాయింట్‌తో సినిమా తీసేందుకు చాలాకాలం పరిశోధన చేశా'' అని రామ్‌గోపాల్ వర్మ అన్నారు.

''వీరప్పన్ లైఫ్‌లో చాలా చాప్టర్స్ ఉన్నాయి. ఇది ఆయనకు సంబంధించిన బయోపిక్ కాదు. ఈ చిత్రాన్ని రియల్ లొకేషన్స్‌లో షూట్ చేశాం. 'ఆపరేషన్ కుకూన్'లో పాల్గొన్న వ్యక్తులను, వీరప్పన్ భార్య ముత్తులక్ష్మీని కలిసి సమాచారం సేకరించా. వీరప్పన్ చేతిలో కిడ్నాప్ అయిన కన్నడ నటుడు రాజ్‌కుమార్ తనయుడు శివరాజ్‌కుమార్ ఈ చిత్రంలో నటిస్తే యాప్ట్ అవుతాడని ఎంచుకున్నా. '' అని చెప్పారు.

English summary
Veerappan’s wife Muthulakshmi demanded a ban on the Killing Veerappan film. Now RGV answers Veerappan's wife.
Please Wait while comments are loading...