»   » రామ్ చరణ్ 'ఆరెంజ్' పై రామ్ గోపాల్ వర్మ కామెంట్

రామ్ చరణ్ 'ఆరెంజ్' పై రామ్ గోపాల్ వర్మ కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ చరణ్ తాజా చిత్రం "ఆరెంజ్" గురించి రామ్ గోపాల్ వర్మ తాజాగా ట్విట్టర్ లో రాసారు. నేను "ఆరెంజ్" చిత్రం ఫంటాబ్యులెస్లీ ఫంటాస్టిక్ కంగ్రాట్స్ అన్నారు. అయితే ఆరెంజ్ చిత్రం టాక్ బయిట బాగోలేదు. దాంతో ఇది కావాలనే వెటకారం చేయటానికి అన్నారా లేక నిజంగానే ఆయన మనస్పూర్తిగా అభినందనలు తెలియచేసారా అన్నది చర్చనీయాంశంగా మిగిలింది. ఇక ఇంతకుముందు కూడా వర్మ..తాను చిరంజీవితో "దొర..ది లార్డ్" అనే చిత్రం చేయాలని ఉందని ఒకసారి, చిరంజీవి ఆయన 150 సినిమాని ఆయనే డైరక్ట్ చేసుకుంటే చూడాలని ఉందని మరోసారి అన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ "పులి" చిత్రం గురించి కూడా ఆయన పిల్లి, ఎలుక అంటూ కామెంట్స్ చేసారు. ఇప్పుడు రామ్ చరణ్ ఆరెంజ్ చిత్రం గురించి ఇలా స్పందించారు. అయితే ఈ విషయమై రామ్ చరణ్ పాజిటివ్ గానే హా..హా..హా..అని ట్విట్టర్ లో రిప్లై ఇచ్చి ఊరుకున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu