»   » నా ఆత్మ కథ ఆమెకు అంకితం: వర్మ

నా ఆత్మ కథ ఆమెకు అంకితం: వర్మ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జీవిత చరిత్ర గన్స్ అండ్ థైస్.. అనే టైటిల్ త్వరలో విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని రూపా పబ్లికేషన్స్ వారు విడుదల చేస్తున్నారు. పుస్తకం మాత్రం వచ్చే నెలలోనే మార్కెట్లోకి విడుదల కానుంది. ఈ నేపధ్యంలో ఈ పుస్తకం ఎవరికి అంకితమిస్తారనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే దీనికి వర్మ తనదైన శైలిలో కన్లూజన్ ఇచ్చేసారు.

తన ఆత్మకథ 'గన్స్ అండ్ థైస్: ది స్టోరీ ఆఫ్ మై లైఫ్ ట్యాగ్‌లైన్‌' పుస్తకాన్ని పలువురికి అంకితం చేస్తున్నట్టు దర్శకుడు రాంగోపాల్ వర్మ తెలిపారు. అయాన్ రాండ్, బ్రూస్ లీ, ఊర్మిళా మండోద్కర్, అమితాబ్ బచ్చన్, పోర్న్ స్టార్ టోరి బ్లాక్, మరికొందరు గ్యాంగస్టర్లకు అంకితం ఇస్తున్నట్టు ట్విటర్ ద్వారా వెల్లడించారు.

RGV DEDICATES his book to Urmila Matoandkar

తాను జీవితంలో పైకి రావడానికి ప్రత్యేక్షంగా, పరోక్షంగా వీరంతా తోడ్పడ్డారని తెలిపారు.


పుస్తకంలోని కొన్ని చాప్టర్లలో... తాను అమితాబ్ బచ్చన్ ను ఇడియట్ అన్న విషయం, తన సినీ జీవితంలో తనకు అండర్ వరల్డ్ తోను, మహిళలతోను ఉన్న సంబంధాల గురించి కూడా ఉంటుందంటూ చెప్తూ ఆసక్తి రేపుతున్నారు.

వర్మ కాస్సేపు మాట్లాడితేనే సంచలనం అనుకుంటే.. ఆయన తన జీవితంలోని అన్ని విషయాలు, విశేషాలతో కలిపి ఆత్మకథ రాశారంటే అది ఇంకెంత సంచలనం అవుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక వర్మ తాజా చిత్రం విషయానికి వస్తే.... గందపుచెక్కల దొంగ వీరప్పన్‌ జీవిత కథ ఆధారంగా వర్మ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అండర్‌ వరల్డ్‌ డాన్‌, మాఫియా డాన్‌ల కంటే కూడా వీరప్పన్‌ ఎంతో శక్తివంతుడు అని, ఆయన తిరుగులేని క్రిమినల్‌ అంటూ వీరప్పన్‌ గురించి వర్మ చెబుతుూ మరీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కన్నడ,హిందీ, తెలుగులో ఈ చిత్రం రూపొందుతోంది.

English summary
Ram Gopal Varma tweeted:"I dedicated my book to Ayn Rand,Bruce Lee.Urmila Matoandkar,Amitabh Bachchan,Pornstar Tori Black and a few gangsters"
Please Wait while comments are loading...