మహేష్ బాబు సినిమాను తీసేంత ఎదవలా కనిపిస్తున్నానా?
మహేష్ బాబు మూవీ బిజినెస్‌మేన్ మీరు మళ్లీ తీస్తున్నారట కదా.... అనే ప్రశ్నకు రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ... తీసిన సినమాను మళ్లీ తీస్తారా ఎవరైనా? నేను మీకు మరీ అంత ఎదవలా కనిపిస్తున్నానా? ఓ మాదిరిగా కూడా
హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం మాట్లాడినా సంచలనమే. ఇటీవల ఓ సందర్భంలో మీడియా అడిగిన ప్రశ్నలకు వర్మ ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు వర్మ. మహేష్ బాబు మూవీ బిజినెస్‌మేన్ మీరు మళ్లీ తీస్తున్నారట కదా.... అనే ప్రశ్నకు రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ... తీసిన సినమాను మళ్లీ తీస్తారా ఎవరైనా? నేను మీకు మరీ అంత ఎదవలా కనిపిస్తున్నానా? ఓ మాదిరిగా కూడా కనిపించడం లేదా? అంటూ చమత్కరించారు.
తన సినిమాల్లో చెడు ఎక్కువగా చూపించడంపై స్పందిస్తూ..... సినిమాల్లో చెడు ఎంత ఎక్కువ చూపిస్తే సమాజంలో అంత మంచి జరుగుతుందని తన నమ్మకమని వర్మ చెప్పుకొచ్చారు. ఏ ప్రశ్న అడిగినా డొంకతిరుగుడుగా సమాధానం చెప్పే వర్మ... తన సమాధానాలతో మీడియా వారిని నవ్వించాడు.

వర్మ చిత్రమైన ట్వీట్: రాక్షసుడిగా మారక ముందు కూతురుతో కలిసి...

చిరంజీవి తమ్ముడి స్థానంలో నేనుంటే కొట్టేవాడిని: రామ్ గోపాల్ వర్మ

చీప్ కామెంట్స్: రామ్ గోపాల్ వర్మను కుక్కతో పోల్చిన హీరో తల్లి!



Click it and Unblock the Notifications











