»   »  వర్మను టార్గెట్ చేసిందెవరు? సెక్యూరిటీ పెంచిన పోలీసులు!

వర్మను టార్గెట్ చేసిందెవరు? సెక్యూరిటీ పెంచిన పోలీసులు!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Ram Gopal Varma
ముంబై: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ముంబై పోలీసులు భద్రత పెంచారు. ఆయనకు కొందరు వ్యక్తులు హాని చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆయన ఇంటి వద్ద, ఆఫీసు వద్ద సెక్యూరిటీ కల్పించారు.

'వర్మ గురువారం బాంద్రా పోలీస్ కమీషనర్ ఆఫీసులోనే గడిపారని, ఆయన నివాసం, కార్యాలయం వద్ద సెక్యూరిటీ టైట్ చేసిన తర్వాత అక్కడి నుంచి తిరిగి ఇంటికి చేరుకున్నారని' వర్మ ప్రతినిధి మీడియాకు తెలిపారు. తన పరిస్థితి గురించి వర్మ కూడా తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

'కొన్ని ఫోన్ కాల్స్ ఆధారంగా పోలీసులు నాకు భద్రత కల్పించారు. నాకు భద్రత ఎందుకు కల్పించారు. ఎవరి వల్ల ముప్పు ఉందనే విషయాలను నేను ఇప్పుడు చెప్పలేను. కొన్ని ముఖ్యమైన కారణాల వల్ల....నాకు భద్రత కల్పించడానికి, సత్య-2 రిలీజ్ విషయానికి సంబంధం ఉందా? లేదా? అనేది కూడా వెల్లడించలేదు' అని వర్మ ట్విట్టర్లో పేర్కొన్నారు.

శర్వానంద్, అనైక జంటగా ముమ్మత్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో సుమంత్‌కుమార్‌రెడ్డి మెట్టు నిర్మించిన చిత్రం 'సత్య-2' (వస్తున్నాడు). ఈ చిత్రం విడుదలని అక్టోబర్ 25న అనుకున్నారు కానీ...నిర్మాత అరుణ్ శర్మకు,దర్శకుడుకి మధ్య విభేధాలు తలఎత్తడంతో చిత్రాన్ని నవంబర్ 8 కి వాయిదా వేసారు.

English summary

 Mumbai: Security arrangements at the office and residence of filmmaker Ram Gopal Varma have been beefed up after he received a threat Thursday.
Please Wait while comments are loading...