భయంగా...సెక్సీగా...టెమ్ట్ చేస్తూ వర్మ 'ఐస్ క్రీమ్' (ట్రైలర్)
హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 'ఐస్ క్రీం' సినిమా రాబోతున్న సంగతి తెలిసింది. టైటిల్ చూసి ఇదేదో వర్మ రొటీన్‌గా తీసే సినిమాలకు భిన్నంగా ఉంటుందని అంతా అనుకున్నారు. అయితే తాజాగా ట్రైలర్ విడుదలైన తర్వాత వర్మ మరోసారి ప్రేక్షకులను ఈ చిత్రం ద్వారా భయపెడతాడని స్పష్టం అవుతోంది. 'ఐస్ క్రీం' ట్రైలర్‌పై మీరూ ఓ లుక్కేయండి మరి...
'ఐస్ క్రీమ్' చిత్రాన్ని భీమవరం టాకీస్ బేనర్లో తుమ్మలపల్లి రామ సత్యనారాయణ ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గత 2 నెలలుగా ఏకబిగిన జరిగిన షెడ్యూల్‌లో షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జులై 4న విడుదల చేయడానికి వర్మ సన్నాహాలు చేసుకుంటున్నారు.

చాలా మందికి అసలు ఈ సినిమా ఎప్పుడు మొదలైందో కూడా తెలియదు. దానికి కారణం ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించక పోవడమే. అసలు ఇలాంటి చేయడం వర్మకు ఇష్టం ఉండదట. సినిమా మొత్తం పూర్తయి..ఒక ట్రైలర్ గానీ, లేదా టీజర్ గానీ చేతికి వచ్చాకే సదరు సినిమా గురించి రామ్ గోపాల్ వర్మ ఎనౌన్స్ చేస్తాడు. ఆ కోవలోనే 'ఐస్ క్రీమ్' టీజర్ రిలీజ్ చేసేందుకు వర్మ రెడీ అవుతున్నాడు. 'ఐస్ క్రీమ్' టైటిల్ చూస్తేనే ఈ చిత్రం వర్మ గత చిత్రాల కంటే భిన్నంగా ఉంటుందని స్పష్టమవుతోంది.
<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/mDVg9OtwPus?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>
తన మొదటి చిత్రం 'శివ'తో 'స్టడీకామ్' అనే పరికరాన్ని పరిశ్రమకు పరిచయం చేసిన రామ్ గోపాల్ వర్మ....'ఐస్ క్రీమ్' చిత్రంతో 'ఫ్లోకామ్' అనే ఒక సరికొత్త పరికరాన్ని చిత్ర పరిశ్రమకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడు. ఈ 'ఫ్లోకామ్' అనే టెక్నికల్ పరికరాన్ని మొత్తం ఆసియాలోనే మొట్ట మొదటి సారిగా 'ఐస్ క్రీమ్' చిత్రం కోసం ఉపయోగించడం విశేషం.


Click it and Unblock the Notifications











