»   » వర్మ ఆత్మకథలో శ్రీదేవి గురించి ఇదిగో ఇలా...

వర్మ ఆత్మకథలో శ్రీదేవి గురించి ఇదిగో ఇలా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మకు హీరోయిన్ శ్రీదేవి అంటే ఎంత అభిమానమో అందరికీ తెలిసిందే. ఎప్పుడూ ఆయన ఆ విషయాన్ని మెన్షన్ చేస్తూనే ఉంటారు. గుర్తు చేస్తూనే ఉంటారు. తాజాగా ఆయన రాస్తున్న ఆత్మకథ 'గన్స అండ్‌ థైస్‌' లో శ్రీదేవికి ఏ ప్రత్యేక అధ్యాయమే ఉందని అంటున్నారు ఆయన. ఆయన ఈ జీవిత చరిత్రం పుస్తకమై ఆయన బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ అనేక విషయాలు ప్రస్దావించారు.

ఈ పుస్తకంలో శ్రీదేవి గురించి వర్మ రాసుకున్న విషయాలను మాట్లాడుతూ ''బోనీకపూర్‌ వంటింట్లో శ్రీదేవి టీ పెట్టడమనే విషయాన్ని నేను తట్టుకోలేను'' అని అన్నారు.

అలాగే..''నా పుస్తకంలో శ్రీదేవి చాప్టర్‌ ఓ లవ్‌ లెటర్‌. నా దృష్టిలో శ్రీదేవి సౌందర్యదేవత. శ్రీదేవి గురించిన నా అభిప్రాయాలను ఇందులో లోతుగా చెప్పాను. ఎవరికి ఎవరిమీదనైనా క్రష్‌ ఉండవచ్చు. క్రష్‌ అనేది సగటు వ్యక్తి మీదయినా ఏర్పడవచ్చు, సెలబ్రిటీ మీదయినా కావచ్చు. ఆ అనుభవం చాలా బావుంటుంది. ఒక రకంగా అది డ్రగ్గులాంటిది'' అని వర్మ అన్నారు.

RGV in Guns & Thighs: The chapter on Sridevi

ఇక ఊర్మిళ గురించి రాసిన విషయాలను ప్రస్తావిస్తూ ''నేను 'సర్కార్‌'లో అమితాబ్‌కు ఎన్ని క్లోజప్‌ షాట్లు వేశానో, ఆయన ముఖ కవళికలను ఎలా కేప్చర్‌ చేశానో, ఊర్మిళ విషయంలోనూ అంతే. నాకు 'రంగీలా' అయినా 'సర్కార్‌' అయినా ఒకటే. పాత్రలు చాలా కీలకం'' అని అన్నారు.

అయాన్ రాండ్‌ రాసిన 'ది ఫౌంటైన హెడ్‌'ను సినిమాగా తీయాలన్నది నాకున్న గొప్ప కల. అందులోని విషయాన్ని ఆకళింపు చేసుకుని సినిమాగా తీయాలన్నది సంకల్పం. ఉదాహరణకు ఆ పుస్తకంలోని హవార్డ్‌ రోర్క్‌ గురించి ఊహించి తెరపైకి తీసుకురావడం... వంటి అంశాలను గురించి ఇంకా ఆలోచిస్తున్నా'' అని అన్నారు.

English summary
RGV Said: Like I mentioned in the book, Sridevi always looked like a damsel in distress, that little girl lost in the woods. I’ve never seen stardom like Sridevi’s — the visual effect of the thing. So, then to see her in a ghar ka kitchen making coffee was a huge letdown. I used to stand in line to buy a ticket for her films with the police beating me with lathis and I used to look at this 50 ft hoarding of her in Vijayawada… From there to see her in a kitchen like a maid!
Please Wait while comments are loading...