»   » పవన్ పై వర్మ యుద్దం ముగిసినట్లేనా? చివరి ట్వీట్ లో బైబై

పవన్ పై వర్మ యుద్దం ముగిసినట్లేనా? చివరి ట్వీట్ లో బైబై

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: పవన్ కళ్యాణ్ కు, రామ్ గోపాల్ వర్మకు మధ్య ఏం జరిగిందో ఎవరికీ తెలియదు కానీ... రామ్ గోపాల్ వర్మ మాత్రం పవన్ పైనా, ఆయన అభిమానుల పైనా ఓ రేంజిలో యుద్దం ప్రకటించినట్లుగా ట్వీట్స్ చేస్తూ వస్తున్నారు.

పవన్‌కల్యాణ్‌ అంటే చాలా ఇష్టమంటూ ట్విట్టర్‌ వేధికగా పవర్‌స్టార్‌ గురించి, ఆయన అభిమానుల గురించి తరచూ ప్రస్తావించే ఆయన తాజాగా ఓ సంచలనమైన ట్వీట్‌ చేశారు.

తాను మంచి ఉద్దేశంతో మాట్లాడుతున్నప్పటికీ ప్రతి ఒక్కరూ అపార్థం చేసుకుంటున్నారని, ఇకపై జీవితంలో పవన్‌కల్యాణ్‌ గురించి ఎటువంటి ట్వీట్‌ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. చివరిగా బై.. బై పవన్‌కల్యాణ్‌ ఫ్యాన్స్‌ అంటూ ట్వీట్‌ చేశారు.

అంతకుముందే పవన్ తన ఉద్దేశ్యాలని అర్దం చేసుకున్నాడని, ఆయన ఇంటర్వూ చూసిన తర్వాత అది అర్దమైందంటూ ట్వీట్ చేసారు. పవన్ ని మరింతగా ప్రేమిస్తాను అన్న ఆయనకు ఇంతలోనే ఏమైందో మరి అంటున్నారు. ఆ ట్వీట్ చూడండి.

పవర్‌ స్టార్‌ పవన్‌కల్యాణ్‌ని నిద్రలేపాల్సిన బాధ్యత ఆయన అభిమానులకు ఉందని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ అన్నారు. పవర్‌స్టార్‌ 'సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌' చిత్రాన్ని ఉద్దేశించి వర్మ తన ట్విట్టర్‌ ఖాతాలో వ్యాఖ్యానించారు.

విదేశీ డబ్బింగ్‌ చిత్రం 'ది జంగిల్‌ బుక్‌' హౌస్‌ఫుల్‌ కలెక్షన్లతో నడుస్తోందని, పీకే 'సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌' మాత్రం అంతగా నడవడం లేదని పేర్కొన్నారు. పవర్‌స్టార్‌ను నిద్ర నుంచి లేపాల్సిన బాధ్యత ఆయన అభిమానులదేనని ట్వీట్‌ చేశారు.

Rgv last tweet about Pawan?

'ది జంగిల్‌ బుక్‌'లో మౌగ్లీగా నటించిన బాలుడి ఫొటోను పోస్ట్‌ చేసి... మెగా పవర్‌ 'సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌', 'రాజా సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌'లను మించిన ఈ బాలుడ్ని చూడండి అంటూ వర్మ ట్వీట్‌ చేశారు.

English summary
Ram Gopal Varma tweeted:"Since everyone's misunderstanding my good intentions I decided never ever in my life to tweet anything about Pawan Kalyan..Bye Bye PK fans"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu