శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికి...రామ్ గోపాల్ వర్మ
తన పుట్టిన రోజు సందర్భంగా దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కొత్త చిత్రాన్ని ఎనౌన్స్ చేశారు. ఆ సినిమా పేరు 'ఒక ప్రేమ కథ'. ముంబయిలో మారియా సుసైరాజ్ అనే యువతి తన ప్రియుడితో కలిసి ఓ వ్యక్తిని చంపి, శవాన్ని ముక్కలు ముక్కలుగా చేసి, కిరోసిన్‌తో తగలపెట్టిన సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో నిర్మించనున్నారు. ఇందులో మారియా సుసైరాజ్ పాత్రను 'దేవ్ డి' నటి మహీ గిల్‌ను ఎంపిక చేసినట్లు ఆయన చెప్పారు.
ఈ సినిమా గురించి వర్మ మాట్లాడుతూ..జీవితంలో చాలా సంఘటనలు మనల్ని కదిలిస్తాయి. భయపెడతాయి. 2008లో ముంబైలో జరిగిన ఓ హత్య నన్ను భయపెట్టింది. ఇద్దరు ప్రేమికులు ఓ వ్యక్తిని కిరాతకంగా చంపి...ఆ శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికి మాయం చేయడానికి ప్రయత్నించారు. ఆ హత్య వెనుక రహస్యాలను చేధిస్తే ఓ గొప్ప ప్రేమకథ ఉంది. ఆ కథనే సినిమాగా తీస్తున్నా. 'దేవ్ డి'లో నటించిన మహిగిల్‌ని ఓ పాత్ర కోసం ఎంచుకొన్నాం. మిగతా నటీనటుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తానని ఆయన చెప్పారు.


Click it and Unblock the Notifications











