»   » నా కారణంగా ‘సిట్’ పక్కదారి పడితే అవమానమే: వర్మ

నా కారణంగా ‘సిట్’ పక్కదారి పడితే అవమానమే: వర్మ

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'సిట్' విచారణ తీరుపై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. వర్మ 'సిట్' విచారణపై చేస్తున్న ఆరోపణలపై కొందరు కేసులు కూడా పెట్టారు. అయినప్పటికీ వర్మ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

తాజాగా ఓ టీవీ ఛానల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. టాలీవుడ్ డ్రగ్స్ దందాలో మీ పేరు ఎక్కడ బయటకు వస్తుందన్న ఆలోచనతోనే, సిట్ విచారణపై కామెంట్లు చేస్తున్నారా? అడిగిన ప్రశ్నకు వర్మ తనదైన రీతిలో స్పందించారు.

ఇంతకంటే ఇన్సల్ట్ ఉంటుందా?

ఇంతకంటే ఇన్సల్ట్ ఉంటుందా?

‘నేను ఇప్పుడిలా అన్నానని, నా పేరుంటే బయట పెట్టడం మానేస్తారా? మన అధికారులు అంత వెధవలని అనుకుంటున్నారా? వర్మ అనేవాడెవడో బాంబే నుంచి ఓ మాటనేశాడు అంటే, దాని మూలాన అతన్ని పిలవద్దు అనుకుంటే... అంతకన్నా ఇన్ సల్ట్ ఉండదు అని వర్మ కామెంట్ చేశారు.

మీడియా క్యాష్ చేసుకుంటోంది

మీడియా క్యాష్ చేసుకుంటోంది

రవితేజ విచారణకు వచ్చిన సమయంలో మీడియాలో చూపించినంతగా ఆయన డ్రైవర్ వచ్చినప్పుడు చూపించలేదని, అందుకు కారణం ఆయనకున్నఇమేజ్ క్యాష్ చేసుకునేందుకేనని వర్మ ఆరోపించాడు.

వారిని ఎందుకు చూపించడం లేదు?

వారిని ఎందుకు చూపించడం లేదు?

ఎంతో మందిని విచారిస్తున్నామని చెబుతున్న సిట్ వారెవరినీ ఎందుకు చూపించడం లేదని ప్రశ్నించారు. సిట్ అధికారులు వాస్తవంగా ఏం జరుగుతోందో, ఎవరు ఏమి చెబుతున్నారో అఫీషియల్ గా అధికార ప్రతినిధి ద్వారా బయట పెట్టాలన్నారు.

అలా జరిగితే సిట్‌కు అవమానమే

అలా జరిగితే సిట్‌కు అవమానమే

తాను చేసిన కామెంట్ల కారణంగా సిట్ విచారణ పక్కదారి పడుతోందని భావిస్తే....సిట్ టీంకు ఇంతకంటే అవమానం మరొకటి ఉండదు. నాలాంటి ఒక మామూలు వ్యక్తి వల్ల విచారణ పక్కదారి పట్టడం లాంటిది జరుగదని వర్మ అభిప్రాయ పడ్డారు.

English summary
RGV is back with satirical comments on media and police department for highlighting the Tollywood drugs issue. Ram Gopal Varma is well-known for his controversial posts shared on his official social media platforms like Twitter and Facebook.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu