For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రజనీకాంత్ ని కెలుకుతూ వర్మ ట్వీట్

  By Srikanya
  |

  హైదరాబాద్: ప్రముఖులను గిల్లతూ ...ఎప్పుడూ ఏదో విధంగా వార్తల్లో ఉండే రామ్ గోపాల్ వర్మ తాజాగా రజనీకాంత్ ని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేసారు. ఆ ట్వీట్ ఇప్పుడు రజనీ అభిమానులకు బి.పి తెప్పిస్తోంది. వారంతా మండిపడుతున్నారు. ఆ ట్వీట్ ఏమిటంటే... రజనీ వక్షోజాలని నేను బాగా ఇష్టపడతాను. అయితే ఎందుకో తెలియదు కానీ కొచ్చడయాన్ లో వాటిని మరింత పెద్దవిగా చేసుకోవాల్సిన అవసరం ఎందుకు రజనీకు వచ్చిందో అని ట్వీట్ చేసాడు. అసలే చిత్రం విడుదల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ చిరాకు తెప్పిస్తున్న ఫ్యాన్స్ కు ఇది పుండుపై కారం చల్లినట్లు అవుతోంది.

  మరో ప్రక్క 'కోచ్చడయాన్‌' విడుదల వాయిదా పడటానికి పంపిణీదారుల వ్యతిరేకతే కారణమా? ప్రస్తుతం ఈ వార్తే కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. తన చిన్న కుమార్తె సౌందర్య దర్శకత్వంలో రజనీకాంత్‌ ద్విపాత్రల్లో నటించిన చిత్రం 'కోచ్చడయాన్‌'. ఎన్నో వాయిదాల తర్వాత ఈ చిత్రం ఈ నెల 9న విడుదల కానుందని ప్రకటించారు. చివరి నిమిషంలో ఈ తేదీని 23కు మార్చారు. సాంకేతిక సమస్యల వల్లేనని చిత్ర వర్గాలు అంటున్నా... పంపిణీదారుల వ్యతిరేకతే కారణమని కోలీవుడ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

  RGV makes tweet fun of Kochadaaiyan team!

  ఈ చిత్రానికి నిర్మాత కూడా సౌందర్యే. ఇప్పటికే పంపిణీ హక్కులను ప్రాంతాలవారీగా అమ్మిన ఆమె... రాష్ట్రంలో సుమారు 500 థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేసుకున్నారు. పంపిణీదారులు మాత్రం గతంలో నిర్ణయించిన మొత్తం చెల్లించబోమంటున్నట్లు సమాచారం. లేదంటే రజనీకాంత్‌ నటించిన చిత్రాన్ని విడుదల చేసి నష్టాల్ని చవిచూశామని, వాటిని ఉన్నపళంగా సెటిల్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారని తెలిసింది. గత నష్టాల నుంచి ఆదుకుంటామని రజనీ హామీ ఇచ్చినా విడుదలకు ఒప్పుకుంటామని వారు చెబుతున్నట్లు సమాచారం. ఈ కారణంగానే సినిమాను చివరి నిమిషంలో వాయిదా వేసినట్లు కోలీవుడ్‌ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

  <blockquote class="twitter-tweet blockquote" lang="en"><p>My prob with Kochhediyan is I luv Rajnikant's boobs how they r n I really don't undrstand why he wants to enhance thm through 3 D animation</p>— Ram Gopal Varma (@RGVzoomin) <a href="https://twitter.com/RGVzoomin/statuses/468112480447651841">May 18, 2014</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

  'కోచ్చడయాన్‌' వాయిదాతో చిన్న సినిమాలన్నీ విడుదలకు సిద్ధమయ్యాయి. డీకే దర్శత్వంలో కృష్ణ హీరోగా నటించిన 'యామిరుక్క భయమే' షూటింగ్‌ పూర్తి చేసుకున్నా.. విడుదల విషయాన్ని ప్రకటించలేదు. 'కోచ్చడయాన్‌' వాయిదా నేపథ్యంలో ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే శుక్రవారం ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. సంతానం హీరోగా నటించిన 'వల్లవనుక్కు పుల్లుం ఆయుధం' (తెలుగు మర్యాదరామన్న) కూడా ఇదే దారి పట్టింది. తొలుత వేసవి బరిలో ఉన్నట్లు ఈ చిత్రాన్ని ప్రకటించినా.. ఇప్పుడు 10న విడుదల చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి. 'కోచ్చడయాన్‌' వచ్చేలోగా మరికొన్ని చిన్న సినిమాలు థియేటర్లలో సందడి చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

  English summary
  Ram Gopal Varma tweeting "My prob with Kochhediyan is I luv Rajnikant's boobs how they r n I really don't undrstand why he wants to enhance thm through 3 D animation".
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X