»   » రామ్ గోపాల్ వర్మ 'రక్త చరిత్ర' లేటెస్ట్ ఇన్ఫో...

రామ్ గోపాల్ వర్మ 'రక్త చరిత్ర' లేటెస్ట్ ఇన్ఫో...

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ గోపాల్ వర్మ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న 'రక్త చరిత్ర' చిత్రం నిన్న(గురువారం) నుంచి ముంబయిలో షూటింగ్ జరుగుతోంది. మొదటి పార్ట్ షూటింగ్ పూర్తి అయి రెండో బాగం షూట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ షూట్ లో తమిళ హీరో సూర్య పాల్గొంటున్నారు. అలాగే ప్రియమణి కూడా ఈ పార్ట్ లో పాల్గొననుంది. దాదాపు పదిహేను రోజుల పాటు ఈ షూటింగ్ ఉండబోతోందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రం గురించి వర్మ తన బ్లాగ్ లో రాస్తూ తాను చాలా ఎమోషనల్ గా కీలక పాత్రలతో ప్రయాణం చేస్తున్నట్లుచెప్పుకొచ్చారు. అలాగే ఈ చిత్రం స్క్రిప్టులో అక్కడక్కడ కొంత అవాస్తవం చోటు చేసుకున్నా అది తన పొరపాటు కాదంటున్నారు. దానికి కారణంగా..నేను ఆ సంఘటనలు జరుగుతున్నప్పుడు ఆ సిట్యువేషన్ లో లేను...అంటూ క్లారిఫై చేస్తున్నారు. అయితే పరిటాల రవి, మొద్దు శ్రీను, మద్దెల చెరువు సూరి పాత్రలు మూడింటినీ బ్యాలన్స్ చేస్తూ కథనం నడుస్తుందని మాత్రం అంతటా వినపడుతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu