»   » 'రగిలే పగ కి ప్రతీకారమే విరుగుడు'- రక్త చరిత్ర-2 (ప్రివ్యూ)

'రగిలే పగ కి ప్రతీకారమే విరుగుడు'- రక్త చరిత్ర-2 (ప్రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

పగ చల్లారడానికి ప్రతీకారమే విరుగుడు అని నమ్మిన విపరీత మనుషుల కథ అంటూ రక్త చరిత్ర చిత్రం సీక్వెల్ రక్త చరిత్ర-2 ఈ రోజు(డిసెంబర్ 3) ధియోటర్స్ కి వస్తోంది. ఈ సెకెండ్ పార్ట్ లో ప్రతాప్ రవి(వివేక్ ఒబరాయ్) రాజకీయ ఎదుగుతూంటాడు. అయితే అతన్ని సూర్యనారాయణ (సూర్య) చంపాలని నిర్ణయించుకుంటాడు. అందుకు అతనికి బలమైన కారణాలు ఉంటాయి. రవిని చంపేందుకు ప్రాన్స్ రెడీ చేసుకుంటాడు. జైల్లోనే ఉంటూ ప్రత్యర్ధులను దెబ్బ తీసేందుకు పన్నాగాలు పన్నుతూంటాడు. అందుకు అతని భార్య భవానీ (ప్రియమణి) ఎలా సహకరించిందన్నది..అతను పగ తీర్చుకున్నాడా...రవి ఏమయ్యాడు...అన్న విషయాలుతో ఈ చిత్రం ఆసక్తిగా నడుస్తుంది.

ఇక ఈ చిత్రం పూర్తి యాక్షన్ ఎపిసోడ్స్ తో నిండి ఉంటుందని చెప్తున్నారు. ముఖ్యంగా సూర్య అభిమానులు పండగ చేసుకునే విధంగా ఈ చిత్రాన్ని తీర్చి దిద్దారు. అలాగే ఈ చిత్రంలో 1997 నంవబర్ 19న రామానాయుడు స్టూడియో వద్ద జరిగిన బాంబు ప్రేలుడు కూడా ఓ కీలకాశం కాబోతోంది. రామానాయుడు స్టూడియో వద్ద బాంబు ప్రేలుడుని అప్పుడు పరిటాల రవి ని టార్గెట్ చేసిందే అని తెలిసిందే. అలాగే ఆ ప్రేలుళ్ళులో మోహన్ బాబు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఆ రోజు పరిటాల రవి నిర్మాతగా ఎన్.శంకర్ దర్శకత్వంలో రూపొందిన శ్రీరాములయ్య చిత్రం షూటింగ్ ప్రారంభం రోజు అది. ఇక ఈ విషయాన్ని పరిటాల రవి ప్రధానపాత్రలో వచ్చిన రక్త చరిత్ర 1లో చిత్రీకరించలేదు. సెకెండ్ పార్ట్ లో ఈ సీన్ హైలెట్ గా, కీలకమై ఉండబోతోందని తెలుస్తోంది. దాంతో సినిమా వర్గాల్లోనే కాక రాజకీయవర్గాల్లోనూ రక్త చరిత్ర 2పై ఆసక్తి పెరిగింది. ఇక ఈ చిత్రం తమిళంలోనూ రక్త సరితం పేరుతో విడుదల అవుతోంది.

తమిళ రక్త చరిత్రకూ, తెలుగు రక్త చరిత్రకూ తేడా ఉందంటున్నారు రామ్ గోపాల్ వర్మ. రక్త చరిత్ర తెలుగులో రెండు వెర్షన్ లుగా విడుదల అవుతుంది. మొదటి వెర్షన్ లో వివేక్ ఒబరాయ్ పాత్రకు(పరిటాల రవి) పాత్రకు పూర్తి ప్రాధాన్యత ఉంటుంది. కేవలం క్లైమాక్స్ పది నిముషాల ముందు మాత్రమే సూర్య(మద్దెల చెరువు సూరి) పాత్ర వస్తుంది. ఇక రక్త చరిత్ర చిత్రం రెండో పార్ట్ లో వివేక్ కీ సూర్య కి మధ్య జరిగే సంఘటనలో సినిమా నడుస్తుంది. అదే తమిళ వెర్షన్ కి వచ్చేసరికి సూర్య పాత్ర మొదటి ముప్పై ఐదు నిముషాలకే వచ్చేస్తుంది. అక్కడ నుంచి ఆ పాత్ర డామినేషన్ గా కథ నడుస్తుంది. అలాగే రక్త చరిత్ర బాగా వయలెన్స్ కూడిన చిత్రం అదే సమయంలో ఇది బాగా ఎమోషనల్ గా ఉండబోతోంది. అయితే వయెలెన్స్ కూడా ఓ హ్యూమన్ ఎమోషన్ అని గుర్తుంచుకోవాలి అంటున్నారు.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu