twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    340 కోట్ల ‘న్యూక్లియర్’: రాజమౌళి, నాగార్జున స్పందన... వర్మ రిప్లై!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్‌: ఇప్పటి వరకు ఇండియాకే పరిమితం అయిన రామ్ గోపాల్ వర్మ... త్వరలో ప్రపంచ స్థాయి సినిమా తీయబోతున్నారు. 'న్యూక్లియర్‌' అనే అంతర్జాతీయ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు, ఈ చిత్రాన్ని రూ. 340 కోట్ల బడ్జెట్‌తోనిర్మిస్తున్నట్లు వర్మ అఫీషియల్ గా ప్రకటించారు.

    వర్మ ఈ చిత్రం గురించి ప్రకటించగాఈ చిత్రాన్ని ఉద్దేశించి దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తన ట్విట్టర్‌ ఖాతాలో తాజాగా ఓ ట్వీట్‌ చేశారు. 'ఆర్‌జీవీ (రామ్‌గోపాల్‌ వర్మ) బ్యాక్‌ విత్‌ బ్యాంగ్‌..? నిజంగా' అని ట్వీట్‌ చేశారు. దీనికి వర్మ వెంటనే రిప్లై ఇచ్చారు.

    'సర్‌.. ఒకరోజు రాత్రి మీతో ఫోన్‌లో మాట్లాడుతూ బీబీ(బాహుబలి) నుంచీ నేను పొందిన స్ఫూర్తి గురించి ప్రామిస్‌ చేశాను. కచ్చితంగా ఈ చిత్రాన్ని విజయవంతం చేస్తాను' అని ట్వీట్‌ చేశారు.

    రాజమౌళి ట్వీట్

    వర్మ న్యూక్లియర్ చిత్రాన్ని తీస్తున్నట్లు ప్రకటించగానే రాజమౌళి తన ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. ‘ఆర్‌జీవీ (రామ్‌గోపాల్‌ వర్మ) బ్యాక్‌ విత్‌ బ్యాంగ్‌..? నిజంగా' అని ట్వీట్‌ చేశారు. దీనికి వర్మ వెంటనే రిప్లై ఇచ్చారు.

    రాజమౌళికి వర్మ రిప్లై ఇస్తూ...

    సర్‌.. ఒకరోజు రాత్రి మీతో ఫోన్‌లో మాట్లాడుతూ బీబీ(బాహుబలి) నుంచీ నేను పొందిన స్ఫూర్తి గురించి ప్రామిస్‌ చేశాను. కచ్చితంగా ఈ చిత్రాన్ని విజయవంతం చేస్తాను' అని ట్వీట్‌ చేశారు.

    గర్వంగా ఉందంటూ నాగార్జున

    రామ్ గోపాల్ వర్మ ఇంటర్నేషనల్ ప్రాజెక్టు మొదలు పెట్టబోతుండటం సంతోషంగా ఉంది. మనమంతా గర్వపడేలా వర్మ ప్రాజెక్టు తెరకెక్కిస్తున్నారని భావిస్తున్నాను అంటూ ట్వీట్ చేసారు నాగార్జున.

    నాగార్జునకు వర్మ రిప్లై ఇస్తూ

    హే నాగ్...అప్పట్లో నేను కొత్తవాడిని అయినా నాపై నమ్మకంతో శివ సినిమా చేసే అవకాశం ఇచ్చావు. నీకు 10 జన్మల పాటు రుణపడి ఉంటాను... అంటూ వర్మ నాగార్జునకు రిప్లై ఇచ్చారు.

    చాలా చాలా గర్వపడుతున్నాను

    చాలా చాలా గర్వపడుతున్నాను

    మామూలు కాలేజ్ గొడవల్లో,సైకిల్ చైన్లతో కొట్టుకునే నేపధ్యంలో,నేను తీసిన "శివ" తో మొదలయ్యిన నా కెరియర్ ఇవ్వాల దేశాల మధ్య గొడవల్లో న్యూక్లియర్ బాంబులు పేల్చుకునే నేపధ్యంలో ఇంగ్లీష్ లో తియ్యబోతున్న"న్యూక్లియర్" వరకూ వచ్చినందుకు, నేను ఒకింత కాకుండా చాలా చాలా గర్వపడుతున్నాను... అని వర్మ తెలిపారు.

    రూ. 340 కోట్ల బడ్జెట్

    రూ. 340 కోట్ల బడ్జెట్

    సి యమ్ ఎ గ్లోబల్ నిర్మించబోతున్న నా " న్యూక్లియర్" చిత్రంచలనచిత్ర చరిత్రలోనే అతి ఖరీదైన చిత్రంగా రూ.340కోట్ల బడ్జెట్ తో రూపుదిద్దుకోబోతోంది. ఇది కూడా అంతర్జాతీయ యాక్టర్ల రెమ్యునరేషన్ లెక్కవేయకుండా కేవలం మేకింగ్ కి కేటాయించిన బడ్జెట్ అని వర్మ తెలిపారు.

    ఇంత భారీ బడ్జెట్ కి కారణం

    ఇంత భారీ బడ్జెట్ కి కారణం

    ఇంత భారీ బడ్జెట్ కి కారణం ఈ చిత్రానికి ఎంచుకున్న అంశాన్ని ఇంతవరకు ఎవరూ చూడనంత, ఊహించలేనంత స్కేల్ లో తెరకెక్కించాలన్న నా నిర్మాతల నిర్ణయం. ఈ చిత్రం అమెరికా, చైనా, రష్యా, యెమెన్, ఇండియాల్లో షూటింగ్ జరుపుకోబోతుండగా ఇందులో అమెరికా, చైనా, రష్యా, బ్రిటన్,యెమెన్, ఇండియాలకు చెందిన నటీనటులు నటించనున్నారని వర్మ తెలిపారు.

    టెర్రరిస్ట్ చేతికి న్యూక్లియర్ బాంబ్ దొరికితే

    టెర్రరిస్ట్ చేతికి న్యూక్లియర్ బాంబ్ దొరికితే

    "న్యూక్లియర్" చిత్రానికి ఎంచుకున్నది ఒక అత్యంత వినూత్నమైన కథాంశం. అమెరికా, యూరప్, మధ్య ఆసియా..ఇలా ఎక్కడైనా ఈ రోజున అందరినీ ప్రధానంగా భయపెడుతున్న వారు తీవ్రవాదులు...ప్రతి ఉదయం నిద్ర లేస్తూనే ప్రపంచంలో ఎక్కడో అక్కడ ఏదో ఒక భయంకరమైన దాడికి సంబంధించిన వార్త మనం వింటూనే వుంటాం. న్యూయార్క్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్స్ ని కూల్చేసినవిమానాలు, రోడ్ల మీద జనాన్ని గుద్ది పడేస్తూ దున్నుకెళ్లే ట్రక్కులు,ప్యారిస్, ముంబాయి వంటి నగరాల్లో వందలమంది అమాయికుల్నిచంపి పారేస్తున్న దృశ్యాలు... ఇలా ఎన్నో ఎన్నెన్నో చూస్తున్నాం వింటున్నాం. కానీ వాటన్నింటికన్నా ఇంకా చాల ఎక్కువుగా అసలు ఊహించటానికే భయపడే అత్యంత భయంకరమైన ఒళ్ళు గగుర్పొడిచే ఆలోచన - ఒక వేళ ఏ టెర్రరిస్ట్ చేతికన్నా న్యూక్లియర్ బాంబ్ దొరికితే అప్పుడు పరిస్థితి ఏమిటి?" - ఇదే "న్యూక్లియర్" చిత్రానికి సంబందించి నా కథ అని వర్మ తెలిపారు.

    ఆ భయం యొక్క మాగ్నిట్యూడ్ ఎంత పెద్దదో

    ఆ భయం యొక్క మాగ్నిట్యూడ్ ఎంత పెద్దదో

    చాలా తీవ్రవాద సంస్థలు న్యూక్లియర్ బాంబులు ఉన్న దేశాలపై కాలుదువ్వుతూ వాటిని కబళించే ప్రయత్నాలు చేస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ ఆలోచనలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. 70 ఏళ్ల తర్వాత కూడా హిరోషిమా, నాగసాకిలపై పడ్డ న్యూక్లియర్ బాంబ్ ధ్వనులు ఇప్పటికీ ప్రపంచపు కర్ణపుటాల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయంటే, ఆ భయం యొక్క మాగ్నిట్యూడ్ ఎంత పెద్దదో అర్థమవుతుంది అని వర్మ చెప్పుకొచ్చారు.

    మూడో ప్రపంచయుధ్ధానికి తెర లేపి ప్రపంచాన్ని అంతం చేస్తుంది

    మూడో ప్రపంచయుధ్ధానికి తెర లేపి ప్రపంచాన్ని అంతం చేస్తుంది

    70 ఏళ్ళ క్రిందట జపాన్ లో జరిగిన ఆ విస్ఫోటం పరిస్థితే అలా ఉంటే ,ఇప్పుడు మనమున్న ఈ కాలంలో ఒక పెద్ద సిటీ లోఅటువంటి న్యూక్లియర్ విస్ఫోటనం జరిగితే? కేవలం ఇరాక్,న్యూక్లియర్ బాంబులు కలిగి ఉందేమోనన్న అనుమానంతో ఆ దేశం పై అమెరికా చేసిన దాడి వల్ల,చాలదేశాలమధ్య విద్వేషాలు పెరగడం, మిత్రదేశాలు శత్రుదేశాలుగా మారిపోవడం, గవర్నమెంట్లు కుప్పకూలడం, మూకుమ్మడిగా ఐసిస్ లాంటి విపరీత తీవ్రవాదులు పుట్టడం జరిగాయంటే, ముంబాయి లాంటి మహా నగరంలో ఒకవేళ ఇప్పుడు నిజంగా న్యూక్లియర్ బాంబ్ పేలితే అది కచ్చితంగా మూడో ప్రపంచయుధ్ధానికి తెర లేపి, తద్వారా మొత్తం ప్రపంచాన్ని అంతం చేస్తుంది. ఇదే "న్యూక్లియర్" పేరుతో నేను ఇంగ్లీష్ లో తీయబోయే నా మొదటి అంతర్జాతీయ చిత్ర కధాంశం.

    English summary
    "Sirrrr and like I promised u one night on phone about my inspiration from BB I will for sure go all out to make this Bang into a BLAST" RGV tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X