»   » యాకుబ్‌ మెమన్‌ ఉరి...వర్మ స్పందన

యాకుబ్‌ మెమన్‌ ఉరి...వర్మ స్పందన

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ముంబయి బాంబుపేలుళ్ల కేసులో నేరస్థుడైన యాకుబ్‌ మెమన్‌కు నాగ్‌పూర్‌ జైలులో గురువారం ఉదయం ఉరిశిక్ష అమలు చేశారు. 1993, మార్చి 12న ముంబయిలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో ప్రధాన దోషిగా నిర్ధారణ అయిన యాకుబ్‌ను ప్రభుత్వం ఎట్టకేలకు ఉరి తీసి ఉగ్రమూకలకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపధ్యంలో రామ్ గోపాల్ వర్మ ఈ క్రింద విధంగా ట్వీట్ చేసారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

యూకుబ్ ముమన్ పై కొంతమంది జాలి చూపిస్తున్నారు. ఎందుకంటే అతను కానీ అతని ఫొటోలు కానీ ఒక సామాన్యులాగే ఉన్నాయి. మనలాగే అతడూ చాలా సాదాసీదాగా కనిపిస్తున్నాడు. కానీ 1993లో జరిగిన ముంబై పేలుళ్ల ఘటనలో ఎంతో మంది చనిపోయారు. 277 మంది మరణం ఒక నెంబర్ లాగే కనిపిస్తున్నట్లు ఉండటం వల్ల కొంతమందికి జాలి కలుగుతోంది.

ఇక యాకుబ్‌ ఉరి పడ్డ క్షణాలకు ముందు...

బుధవారం రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సమావేశం అనంతరం యాకుబ్‌ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించారు. దీంతో 14 రోజుల పాటు శిక్షను వాయిదా వేయాలని యాకుబ్‌ మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. సుప్రీంకోర్టు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ పిటిషన్‌పై తెల్లవారుజామున సుమారు 90 నిమిషాల పాటు వాదనలు జరిగాయి.

RGV responds over Yakub menon Hanged

యాకుబ్‌ తరపున ఆనంద్‌ గ్రోవర్‌ వాదన వినిపిస్తూ.. క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించిన పత్రం యాకుబ్‌కు అందలేదని కోర్టును తెలియజేశారు. క్షమాభిక్ష పిటిషన్‌ తిరస్కరణను సవాలు చేసే హక్కు యాకుబ్‌ ఉందని.. అయినా ఇంత తక్కువ సమయంలో క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ఎలా తిరస్కరించారని ప్రశ్నించారు. పిటిషన్‌ తిరస్కరణ తర్వాత 14 రోజులు గడువు ఇవ్వాలని గ్రోవర్‌ వాదించారు. యాకుబ్‌ తరపు న్యాయవాది వాదనను అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గీ తోసిపుచ్చారు.

యాకుబ్‌ పిటిషన్‌ న్యాయవ్యవస్థను కించపర్చేదిగా ఉందని... ఈ పిటిషన్‌ విచారనార్హం కాదని ఆయన కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు యాకుబ్‌ పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో నేటి ఉదయం అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నాగ్‌పూర్‌ జైలులో యాకుబ్‌ మెమన్‌ను ఉరి తీశారు.యాకుబ్‌ మెమన్‌ ఉరి శిక్ష అమలు దృష్ట్యా ముంబయి, నాగ్‌పూర్‌లలో హైఎలర్ట్‌ ప్రకటించారు. నాగ్‌పూర్‌ జైలు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించారు.

English summary
Ram Gopal Varma tweeted: "I wish we can see pic of Memon along with pics of all murdered 257 people laid side by side..Only then his horrificness can be understood. Sympathy of certain people on Memon is becos in his pics he looks normal like any of us whereas the dead 257 ppl are just a number"
Please Wait while comments are loading...