twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెన్సార్ సమస్యల్లో 'బెజవాడ'

    By Srikanya
    |

    రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న 'బెజవాడ'చిత్రం ప్రస్తుతం సెన్సార్ సమస్యల్లో పడిందని సమాచారం. డిసెంబర్ ఒకటవ తేదిన విడుదలకు ప్లాన్ చేసిన ఈ చిత్రం కి సెన్సార్ వారు ఇరవై మేజర్ కట్స్ తో ఓకే చేయగలమని చెప్పినట్లు తెలుస్తోంది.కొన్ని ప్రత్యేక కమ్యునిటీలను ఈ చిత్రం ఎడ్రస్ చేస్తోందని,వారి మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి క్లియరెన్స్ సర్టిపికేట్ ఇవ్వటం కష్టమని చెప్పినట్లు తెలుస్తోంది.అయితే దర్శకుడు వివేక్ కృష్ణ,వర్మ దానకి ఒప్పుకోవటం లేదని,వారు రివైజింగ్ కమిటింగ్ కి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్తున్నారు.అలా అయితే సినిమా విడుదల లేట్ అయ్యే అవకాసం ఉన్నా సినిమా దెబ్బతినకూడదని ఆ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్తున్నారు. అయితే రివైజింగ్ కమిటిలో కూడా పోరాటం చెయ్యవలిసి ఉంటుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

    ''బెజవాడ అనేది ఓ ఊరి పేరు మాత్రమే. అక్కడి రాజకీయాలకూ మా సినిమా కథకూ ఏ మాత్రం సంబంధం లేదు. కానీ సన్నివేశాలన్నీ వాస్తవ ప్రపంచానికి అద్దంపడతాయంటూ బెజవాడ చిత్రం దర్శకుడు వివేక్ కృష్ణ చెప్తున్నారు.డిసెంబర్ ఒకటవ తేదీన ఈ చిత్రం విడుదల సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన ఇలా చెప్పారు.ఈ సినిమాపై విజయవాడలో జనం ఆందోళన పడుతున్న నేపధ్యంలో వీరి స్టేట్ మెంట్స్ ఆసక్తిని కలిగిస్తున్నాయి.బెజవాడ,రౌడీయిజం అని చెప్పి అందరూ మీడియాలో ఈ సినిమా గురించి వార్నింగ్ లు ఇస్తూంటే ఇలా చేతులు ఇత్తేస్తూ అబ్బే ఊరికే టైటిల్ కోసం బెజవాడ వాడాం కానీ అక్కడ పరిస్ధితులను మేము సినిమా లో చూపెట్టలేదు అంటున్నారు.

    నిర్మాత వర్మ సైతం ఈ విషయంపై మాట్లాడుతూ..ఇది ఫిక్షనల్ స్టోరీ.'బెజవాడ' అనే టైటిల్ పడింది మొదలు ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ షాట్ వరకు ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది అనేది ఇందులో చర్చించడానికి అవకాశం ఉండదు. అంత గ్రిప్పింగ్‌గా సినిమా ఉంటుంది.అలాగే 'బెజవాడ'లో ఉండే రెండు వర్గాలకు సంబంధించిన కథా కాదు.భగవంతుడి సాక్షిగా... 'బెజవాడ' కేవలం కల్పిత కథ. ఎవరిని ఉద్దేశించి తీసింది కాదు అన్నారు.

    English summary
    Censor board isn’t willing to give clearance to 'Bejawada' film. Censor Board panel feels that this film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X