twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'డిపార్టమెంట్' తెలుగు వెర్షన్ గురించి వర్మ

    By Srikanya
    |

    వర్మ 'డిపార్టమెంట్' మొన్న శుక్రవారం విడుదల అయిన సంగతి తెలిసిందే. హిందీలో విడుదల అయి డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రానికి త్వరలో తెలుగు వెర్షన్ కూడా రెడీ చేసి విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. అప్పలరాజు, దొంగల ముఠా, బెజవాడ చిత్రాలు వరసగా వర్మతో నిర్మించిన కిరణ్ కుమార్ కోనేరు ఈ చిత్రాన్ని తెలుగులో డబ్ చేసి వదులుతున్నారు. తెలుగు వెర్షన్ కి డైలాగులు శశాంక్ వెన్నెలకంటి రాస్తూండగా, పాటలు సిరాశ్రీ రాస్తున్నారు.

    ఈ విషయమై వర్మ లేటెస్ట్ గా ట్వీట్ చేస్తూ...మేము డిపార్టమెంట్ రియల్ వెర్షన్ ని తెలుగులో విడుదల చేస్తున్నాం. నేను దీన్ని రెండో డిపార్టమెంట్ గా పిలుస్తున్నాను. ఒరిజనల్ కి దీనికి చాలా తేడా ఉంటుంది. తెలుగు వెర్షన్ లో చాలా సీన్స్ ఇన్ కార్పోరేట్ చేసాం అని ట్వీట్ చేసారు. ఇక తెలుగు వెర్షన్ కి సంజయ్ దత్ పోర్షన్ తగ్గించి,కేవలం రానాదే హైలెట్ చేస్తూ ఎడిట్ చేసి విడుదల చేయనున్నట్లు సమాచారం.

    తెలుగునుంచి దగ్గుపాటి రాణా, మంచు లక్ష్మి ప్రసన్న,మధుషాలిని,అంజనా సుఖాని వంటివారు నటించటంతో ఇక్కడ కూడా క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. అయితే తెలుగు రిలీజ్ డేట్ ఎప్పుడన్నది మాత్రం ప్రకటించలేదు. ఇక హిందీ వర్షన్ ని ఆల్ ఓవర్ ఆంధ్రాలో విడుదల చేసారు. అయితే ఆంధ్రా, సీడెడ్ లలో కొన్ని ఎంపిక చేసిన స్క్రీన్స్ లో మాత్రమే ఈ చిత్రాన్ని ప్రదర్శించారు.
    ఇక డిపార్టమెంట్ చిత్రం పోలీస్ వ్యవస్దకి,అండర్ వరల్డ్ ఆర్గనైజేషన్ మధ్యన ఉండే సంభందాలని ముఖ్య కధా వస్తువుగా తీసుకుని మలచటం జరిగింది.

    దీంట్లో అమితాబ్ ఒక రాజకీయ నాయకుడుగా మారిన ఎక్స్ క్రిమినల్ పాత్రను పోషిస్తున్నాడు. సంజయ్ దత్ అండర్ వరల్డ్ ని సమూలనంగా నాశనం చెయ్యటానికి సృష్టించిన డిపార్టమెంట్ కి లీడర్ లోల్ వేస్తున్నారు. అభిమన్యు సింగ్ ఒక క్రూరమైన క్రిమినల్ రోల్ ని పోషిస్తున్నాడు. విజయ్ రాజ్ పరారీలో ఉన్న ఒక మాఫియా డాన్ రోల్ పోషిస్తున్నారు. వీళ్లు కాకుండా తెలుగులోని దగ్గుపాటి రాణా,లక్ష్మి మంచు,మధు షాలని కూడా చాలా ముఖ్యపాత్రల్లో ఉన్నారు. రాణా దగ్గుపాటి ఒక పోలీస్ పాత్రను పోషిస్తున్నారు. లక్ష్మిమంచు సంజయ్ దత్ భార్య పాత్రని పోషిస్తోంది. మధు షాలిని ఫిమేల్ గ్యాగస్టర్ రోల్ ని పోషిస్తోంది.

    English summary
    RGV says he's going to re-release Department film in Telugu after making a few changes to it. "We will be releasing the real version of Department in Telugu soon. I will call it 'Rendo Department". This will be very different from the original and we will incorporate many different scenes in the Telugu version," tweeted Ram Gopal Varma.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X