»   » రంగా,ఆయన భార్య గురించిన నిజాలు బయిటపెట్టాలా? వర్మ బెదిరింపు,వార్నింగ్

రంగా,ఆయన భార్య గురించిన నిజాలు బయిటపెట్టాలా? వర్మ బెదిరింపు,వార్నింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

విజయవాడ: సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ తాజా చిత్రం 'వంగవీటి'పై వివాదం ముదురుతోంది. విజ‌య‌వాడ‌లో ప్ర‌ముఖ నేత‌గా ఎదిగిన వంగ‌వీటి మోహ‌న రంగా జీవిత చ‌రిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించిన వ‌ర్మ‌... మూడు రోజుల క్రితం దానిని విడుద‌ల చేశారు.

మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న వంగ‌వీటిపై చిత్ర‌మంటే సాధారణంగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆస‌క్తి నెల‌కొంది. జ‌నం కూడా వంగ‌వీటి చిత్రం చూసేందుకు థియేట‌ర్ల‌కు క్యూ క‌డుతున్నారు. ఫ‌లితంగా వ‌ర్మ‌కు కాసుల వ‌ర్ష‌మే కురుస్తోంది.

అయితే తాము ఊహించిన విధంగా లేకున్నా ఫ‌ర‌వా లేదు... వంగ‌వీటి ప్ర‌స్థానం జ‌రిగింది జ‌రిగిన‌ట్లుగా చూపితే చాల‌ని, అందుకు విరుద్ధంగా క‌నిపిస్తే మాత్రం పోరాడ‌తామని ఆ సంద‌ర్భంగా వంగవీటి రాధా హెచ్చ‌రిక‌లు జారీ చేశారు.అయితే రాధా అనుకున్న‌ట్లుగానే ఆ చిత్రంలో ప‌లు సన్నివేశాలు అభ్యంత‌ర‌క‌రంగా ఉన్నాయ‌ట‌.

దీంతో రాధా ఏకంగా డీజీపీకి ఫిర్యాదు చేశారు. త‌న తండ్రిని కించ‌పరిచేలా ప‌లు స‌న్నివేశాలు చిత్రంలో ఉన్నాయ‌ని ఆయ‌న చేసిన ఫిర్యాదుతో డీజీపీ క‌లుగ‌జేసుకుని ఓ స‌న్నివేశాన్ని చిత్రం నుంచి తీసివేయించేలా వ‌ర్మ‌ను ఒప్పించారు.

కానీ ఈ లోగా మరోసారి 'వంగవీటి' చిత్రంలో రంగా గురించి అవాస్తవాలను చూపారని ఆరోపించారు. ఈ విషయమై రామ్ గోపాల్ వర్మ కూడా కాస్త గట్టిగానే స్పందించారు. ఆయన కూడా బస్తీమే సవాల్ అనేసారు.

 చరిత్రను మార్చి...

చరిత్రను మార్చి...


డబ్బు కోసం చరిత్రను మార్చి సినిమాలు తీస్తే వంగవీటి అభిమానులు చూస్తూ వూరుకోరని వంగవీటి రాధాకృష్ణ అన్నారు. వంగవీటి మోహనరంగా 28వ వర్థంతి సందర్భంగా ఆయన కుమారుడు రాధాకృష్ణ విజయవాడలో రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

 వక్రీకరించితీసారు

వక్రీకరించితీసారు


అనంతరం వంగవీటి రాధాకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ డబ్బు కోసం చరిత్రను వక్రీకరించి చిత్రాలను తీస్తున్నారని ధ్వజమెత్తారు. ‘వంగవీటి' చిత్రంలో రంగా గురించి అవాస్తవాలను చూపారని ఆరోపించారు.

 హెచ్చరిక

హెచ్చరిక


రంగా పరువు, ప్రతిష్ఠలు దెబ్బతీసేలా వాస్తవాలను వక్రీకరించి సినిమా తీశారన్నారు. దీనిని రంగా అభిమానులు తీవ్రంగా ఖండిస్తున్నారని... అవసరమైతే న్యాయపోరాటానికి దిగుతామని వంగవీటి రాధాకృష్ణ హెచ్చరించారు.

 ఓ సవాల్

ఓ సవాల్

వంగవీటి సినిమాకు సంబంధించిన విమర్శలకు రామ్ గోపాల్ వర్మ ప్రతిస్పందించి, తన సినిమా పీఆర్వో ద్వారా ఓ ఫ్రకటన విడుదల చేయించారు. ఈ ప్రకటన దాదాపు ఓ సవాల్ మాదిరిగా ఉండటం అందరినీ ఆశ్చర్యంలో పడేసింది.

 మర్డర్లు మాట అటుంచి..

మర్డర్లు మాట అటుంచి..

రంగాగారి క్యారెక్టర్ని వక్రీకరించానన్నా రాధా కామెంట్లకి నా సమాధానం
1. రంగా గారు బోసిపళ్ళ మహాత్మా గాంధీ అని చూపించాలా?
2. మర్డర్ల మాట అటుంచి ఎవర్ని మొట్టికాయ కూడా కొట్టలేదని చూపించాలా? అని సూటిగా వర్మ ప్రశ్నించారు.

 చీమకైనా హాని...

చీమకైనా హాని...

అలాగే..రామ్ గోపాల్ వర్మ కంటిన్యూ చేస్తూ... మరో రెండు ప్రశ్నలు వదిలారు..
3. మదర్ థెరిస్సా కన్నా సాత్వికుడు అని చూపించాలా?
4. అన్న దానాలు,ప్రజా సేవ తప్ప చీమకైనా హాని చెయ్యని గౌతమ బుద్దుడని చూపించాలా?

 రంగా భార్య గురించి..

రంగా భార్య గురించి..

వాస్తవాలే చూపించాల్సిందన్న రాధా డిమాండ్లకి నా సమాధానం-
రంగా గారి గురించి ఆయన భార్య గురించి, రంగా గారి అభిమానులు వినటానికి చూడటానికి ఇష్టపడని డాక్యుమెంటేడ్ వాస్తవాలు నేను చాలా చాలా చూపించగలను... కాని రంగా గారిమీద వున్న గౌరవంతో అవి చూపించలేదు.

 ఆ వాస్తవాలు ఏమిటనేది..

ఆ వాస్తవాలు ఏమిటనేది..

దమ్ముండి ఆ వాస్తవాలు ఏమిటని రాధా డిమాండ్ చేస్తే వాటన్నింటిని కుండ బద్దలు కొట్టినట్టు చెప్తా. నేను ముందునుంచి చెప్తున్నది వంగవీటి సినిమా తియ్యడంలో నా ఉద్దేశ్యం ఆ జీవిత కథల ఆధారంగా అప్పుడు జరిగిన ఆ సంఘటనల వెనుక వాళ్ళ సున్నితమైన భావోద్వేగాలని చూపించడం మాత్రమే.

 ఏమీ అర్దం చేసుకోకుండా..

ఏమీ అర్దం చేసుకోకుండా..

ఒరిజినల్ వంగవీటి రాధా, వంగవీటి రంగా గార్లలో ఉన్నగొప్పతనంలో ఈ రాధాకి 0.1%లేకపోవడం మూలానే ఈ రాధా పరిస్థితి ఇలా వుంది ఏమి అర్ధం చేసుకోకుండా మాట్లాడుతున్నాడు.

 పచ్చి నిజం ఏమిటంటే...

పచ్చి నిజం ఏమిటంటే...

వంగవీటి సినిమా గురించి దుర్భుద్ది ఉన్న వాళ్ళు నా దురుద్దేశ్యం గురించి ఎంత అరిచి గీ పెట్టినా ,పచ్చి నిజం ఏమిటంటే రంగా గారి మీద రాధాకి,రత్నకుమారిగారికి ఉన్న గౌరవం కన్నా ఎన్నో రెట్లు నాకెక్కువ గౌరవముంది. ఈ నిజం నిజాయితీగా గుండెల మీద చేయ్యేసుకున్న ప్రతి నిజమయిన రంగా అభిమానికి వాళ్ళ వాళ్ళ మనసుల్లో తెలుసు.

 నన్నేదో చేసేస్తాను...

నన్నేదో చేసేస్తాను...

నేను తీసిన వంగవీటి సినిమా కరెక్ట్ కాదనుకుంటే రాధాని "అసలు వంగవీటి"అని ఇంకో సినిమా తీసి లోకానికి చూపించుకోమనండి. ఇకపోతే నన్నేదో చేసేస్తానన్న రాధా ఇచ్చిన వార్నింగ్ కి నా కౌంటర్ వార్నింగ్.

 టైం నువ్వు చెప్పద్దు...

టైం నువ్వు చెప్పద్దు...

బస్తీ మే సవాల్-- సెంటర్ నేను చెప్పను- టైం నువ్వు చెప్పొద్దు అంటూ వర్మ ఈ ప్రెస్ నోట్ ని ముగించటం చాలా మంధికి ఆశ్చర్యం కలిగించింది. వర్మ ఇంత ధైర్యంగా ఇలా డైరక్ట్ గా వంగవీటి రాధాకృష్ణపై ఎటాక్ చేస్తారని ఎవరూ ఊహించలేదు. ఇప్పుడు రాధా మరి ఎలా స్పందిస్తారో చూడాలి.

English summary
Recently, Vangaveeti Radha, son of the firebrand politician from Vijayawada late Vangaveeti Ranga, warned filmmaker Ram Gopal Varma against showing his father in a bad light in his ambitious biopic, Vangaveeti. Now RGV warned Radha.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu