మీ గోల మీదే..నా గోల నాదే (వర్మ మరో ఫస్ట్ లుక్ )
హైదరాబాద్ : విభిన్న కథాంశాలతోనే కాకుండా డిఫరెంట్ టైటిల్స్‌తో సినిమాలు తీసే దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజా చిత్రం 'ఐస్‌క్రీమ్'. భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నవదీప్ హీరో. తేజస్వి హీరోయిన్. ఈ చిత్రం మొన్న శనివారం విడుదలై ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం రివ్యూలపై కాంట్రావర్శి కూడా వచ్చింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం సీక్వెల్ ని వర్మ ప్రకటించారు. ఈ చిత్రం పోస్టర్ ని సైతం విడుదల చేసారు.
ఈ సీక్వెల్ చిత్రాన్ని సైతం వర్మ నాన్‌స్టాప్ షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తి చేస్తామని చెప్తున్నారు, ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ పనిలో నిమగ్నమయ్యారు. స్పీడుగా షూటింగ్ పూర్తి చేసి సెప్టెంబర్ లో విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ చిత్రం సైతం లో బడ్జెట్ లో పూర్తి చేయనునట్లు చెప్తున్నారు.

టైటిల్‌కు తగ్గట్లుగానే వర్మ ఇప్పటివరకూ తీసిన చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. 'ఐస్‌క్రీమ్' చిత్రానికున్న మరో ప్రత్యేకత ఏమిటంటే.. తన మొదటి సినిమా 'శివ'తో స్టడీకామ్ కెమెరాను పరిచయం చేసిన రాము తాజాగా ఈ చిత్రంలో ఫ్లోకామ్ అనే కెమెరాను ఉపయోగించారు. దీనిని ఆసియాలోనే తొలిసారిగా ఉపయోగించిన దర్శకుడు వర్మ అని చెప్పాలి. ఫ్లోకామ్‌తో చిత్రీకరించిన సన్నివేశాలను చూసిన ప్రేక్షకులు సరికొత్త అనుభూతి పొందుతారని యూనిట్ సభ్యులు చెప్పారు.


Click it and Unblock the Notifications











