For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కసికే కసెక్కించేలా..: రౌద్రం రాజేసిన 'కడప' సాంగ్, చావు కొడుకా..

  |
  'కడప' టైటిల్ సాంగ్.. చావు కొడకా..!

  పైత్యం అనుకున్నా సరే.. పొగరు అనుకున్నా సరే.. రాంగోపాల్ వర్మకు అవేమి పట్టవు. చెప్పాలనుకున్నది సూటిగా చెప్పేయడం.. తీయాలనున్నది తీసి చూపించేయడం.. ఆయన వెరుపు లేని శైలికి నిదర్శనం.

  తన మైండ్‌సెట్‌కు రక్తపాతం, మాఫియా, డార్క్ బ్యాక్ డ్రాప్.. లాంటి సబ్జెక్టులు మాత్రమే కనెక్ట్ అవుతాయని, లవ్ స్టోరీలు, ప్యామిలీ స్టోరీలు గట్రా తనవల్ల కాదని కుండబద్దలు కొట్టే వర్మ.. తనకు నచ్చిన సబ్జెక్టును మాత్రమే తెరకెక్కిస్తారు.

  దర్శకుడిగా తనకు అనిపించింది తీయడమే తప్ప.. ప్రేక్షకుడి కోణం ఆయనకు అనవసరం. అందుకే.. చూస్తే చూడండి.. లేకపోతే లేదని నిర్మొహమాటంగా ముఖం మీదే చెప్పేయగలడు. ఇప్పుడు 'కడప' వెబ్ సిరీస్ తోనూ ఆయన అదే చెప్పదలుచుకున్నారు.

  "కడప రెడ్ల చరిత్ర"పై వెబ్ సిరీస్: సీమ నిజాల్ని నగ్నంగా చూపిస్తానంటున్న వర్మ

  'కడప' టైటిల్ సాంగ్:

  రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న కడప వెబ్ సిరీస్ కు సంబంధించి దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా టైటిల్ సాంగ్ విడుదల చేశారు. గీత రచయిత సిరాశ్రీ రాసిన ఈ పాటలో 'కడప' అంటేనే.. కేరాఫ్ ఫ్యాక్షన్ అన్నట్లుగా లిరిక్స్ ఉన్నాయి.

  'కడప' లిరిక్స్:

  'కడప' లిరిక్స్:

  యమద్వారపు గడప
  కడప కడప కడప కడప కడప కడప కడప
  అది బలిపీటపు గడప
  కడపంటే ఫ్యాక్షన్, కడపంటే యాక్షన్
  కడపంటే ఓ టెన్షన్, కడపే అటెన్షన్

  కడపంటే ఊరు కాదు... బాంబురా కొడకా
  కడపంటే పేరు కాదు... మృత్యువురా కొడకా
  కడపకెదిరి తొడగొడితే గోతిలేనే పడక
  కడపను తిరగేస్తే పడక కానీ అది చావు కొడకా...!

  తాజాగా విడుదల చేసిన పాటలో లిరిక్స్ ఇలా ఉండటం గమనించవచ్చు.

  ‘కడప' ఎఫెక్ట్: రామ్ గోపాల్ వర్మ అరెస్టు దిశగా ప్రయత్నాలు!

  ఎవరిని టార్గెట్ చేశారు?:

  ఎవరిని టార్గెట్ చేశారు?:

  రాయలసీమ ఫ్యాక్షన్ అంటే.. అది ఏ ఒక్కరికో పరిమితమైనది కాదు. చాలామంది రాజకీయ నాయకులకు కూడా అందులో హస్తం ఉంది. పరోక్షంగా ఇప్పటికే వైఎస్ రాజశేఖర్ రెడ్డి, పరిటాల రవి లాంటి పేర్లను టచ్ చేసిన వర్మ.. తన వెబ్ సిరీస్ లో ఎవరి నేపథ్యాన్ని టచ్ చేయబోతున్నాడన్నది ఆసక్తికరంగా మారింది.

  ఆర్జీవీ ‘కడప' వెబ్ సిరీస్ ట్రైలర్ దారుణంగా ఉంది... వైఎస్, పరిటాల ప్రస్తావన!

  ఇది అన్యాయమంటున్నారు:

  ఇది అన్యాయమంటున్నారు:

  దశాబ్దాలుగా రాయలసీమ వాసులకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ ద్రోహం చేసిందనే ఒక ఆరోపణ ఉంది. కేవలం అక్కడి ఫ్యాక్షన్ అంశాలనే తెరమీద చూపిస్తూ.. అక్కడివాళ్లను మానవత్వం లేనివాళ్లుగా చూపించే ప్రయత్నం చేశారన్న విమర్శలున్నాయి.

  రాయలసీమ అంటే అదేనా?

  రాయలసీమ అంటే అదేనా?

  ఫ్యాక్షన్ నుంచి కాస్త పక్కకు తొంగిచూస్తే.. రాయలసీమకు అద్భుతమైన సంస్కృతి, జీవద్భాష ఉందనేది సినిమా దర్శకులకు ఎన్నడూ గుర్తు రాలేదు. ఇప్పుడు వర్మ మరో అడుగు ముందుకేసి.. ఏకంగా రాయలసీమ అంటేనే మిగతా ప్రాంతాల ప్రజలకు వెన్నులో వణుకు పుట్టించేలా అపోహలు కలిగించడానికి సిద్దమయ్యారన్న విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

  రాము.. పట్టించుకోడంతే?

  రాము.. పట్టించుకోడంతే?

  ఎవరెన్ని విమర్శలు చేసినా.. రోడ్డెక్కి నిరసనలు తెలిపినా.. రాము మాత్రం యథావిధిగా వాటిని పట్టించుకునే స్థితిలో లేడు. తాను తీయాలనుకున్నాడు.. తీసి చూపిస్తాడు. నచ్చకపోతే చూడకండి అని గతంలో లాగే మరోసారి చెబుతాడు. అయితే భగ్గుమంటున్న రాయలసీమ జనం దీనిపై ఎంతదాకా వెళ్తారో చూడాలి.

  English summary
  Controversial filmmaker Ram Gopal Varma, who has courted controversy with many films, again with another, recently Kadapa webseries title song released.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X