twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'మా ఇష్టం' వాయిదా.. పోరాటం చేస్తానన్న వర్మ.. బండారం బయటపెడతానన్న నట్టి కుమార్

    |

    ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ డేంజ‌ర‌స్ మా ఇష్టం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. తనతో కొన్ని సినిమాలు చేసిన అప్సరా రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రలలో ఒక లెస్బియన్ స్టోరీ తెరకెక్కించారు. అయితే ఈ సినిమా మీద కోర్టు స్టే ఇవ్వగా ఇప్పుడు సినిమా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఆ వివరాలు

    శుక్ర‌వారం నాడు

    శుక్ర‌వారం నాడు

    వర్మ తెరకెక్కించిన మా ఇష్టం చిత్రం రిలీజ్ వాయిదా ప‌డింది. దీనికి గ‌ల కార‌ణాన్ని కూడా వివ‌రిస్తూ వ‌ర్మ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. డేంజ‌ర‌స్ చిత్రాన్ని విడుద‌ల వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన వ‌ర్మ‌ త్వ‌ర‌లోనే చిత్రాన్ని విడుద‌ల చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. ముందుగా నిర్ణ‌యించిన షెడ్యూల్ ప్ర‌కారం శుక్ర‌వారం నాడు ఈ సినిమా విడుద‌ల కావాల్సి ఉంది.

    అన్ని మార్గాల్లో పోరాటం

    అన్ని మార్గాల్లో పోరాటం

    అయితే స్వ‌లింగ సంప‌ర్కం నేప‌థ్యంలో వ‌ర్మ తెర‌కెక్కించిన ఈ సినిమాను ప్రదర్శించేందుకు పీవీఆర్ సినిమాస్‌, ఐనాక్స్ సినిమాస్ తిర‌స్క‌రించిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత మరికొన్ని థియేట‌ర్లు కూడా ఈ సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌కు ముందుకు రాలేద‌ని అంటున్నాడు. ఈ కార‌ణంగానే సినిమా విడుద‌ల‌ వాయిదా వేస్తున్న‌ట్లు వర్మ ప్ర‌క‌టించారు. త‌న‌కూ,. త‌న చిత్రానికి జ‌రుగుతున్న అన్యాయంపై అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్లో పోరాటం చేస్తాన‌ని వ‌ర్మ‌ చెప్పారు.

     5.29 కోట్లు ఇవ్వాలని

    5.29 కోట్లు ఇవ్వాలని

    త్వ‌ర‌లోనే చిత్రం విడుద‌ల‌కు మ‌రో తేదీని ప్ర‌క‌టిస్తాన‌న్నారు. ఇక నిజానికి అంతకు ముందే రామ్ గోపాల్ వర్మకు షాక్ తగిలింది. ఆయన 'డేంజరస్ (మా ఇష్టం)' విడుదలను ఆపేయాలని సిటీ సివిల్ కోర్టు ఆదేశాలను జారీ చేసింది. వర్మ రిలీజ్ చేస్తున్న మా ఇష్టం సినిమా మీద సినీ నిర్మాత నట్టి కుమార్ పిటిషన్ వేశారు. వర్మ తనకు రూ. 5.29 కోట్లు ఇవ్వాలని... ప్రతి సినిమాకు రూ. 50 లక్షలు ఇవ్వాలని ఒప్పందం ఉండగా దాన్ని పక్కన పెట్టి సినిమా విడుదల చేస్తామని పిటిషన్ లో పేర్కొన్నారు.

    Recommended Video

    I Think The Sensor People Also Like Le$ibi@n$ - RGV | Filmibeat Telugu
    రెస్పాన్స్ లేదని

    రెస్పాన్స్ లేదని

    అయితే ఒప్పందం ప్రకారం తనకు ఈ సినిమా రిలీజ్ సమయంలో డబ్బులు ఇవ్వలేదని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ విచారించిన కోర్టు వర్మ తాజా చిత్రం విడుదలను ఆపాలని తీర్పును వెలువరించింది. ఇక నిర్మాత నట్టి కుమార్ రామ్ గోపాల్ వర్మ పెద్ద మోసగాడని ఆరోపణలు చేశారు. ఈ రోజు పుట్టిన రోజు కాబట్టి సినిమా విడుదల కాకుండా గిఫ్ట్ ఇచ్చానని ఆయన అన్నారు. నాకు 5 కోట్ల 29 లక్షలు ఇవ్వాలని, ఎప్పుడు డబ్బులు అడిగిన రెస్పాన్స్ లేదని అన్నారు.

    బండారం బయటపెడుతా

    బండారం బయటపెడుతా

    సినిమా తీస్తాడు డబుల్ అగ్రిమెంట్ వేరే వాళ్లకు చేస్తాడని అన్నాడు. రామ్ గోపాల్ వర్మ తో 20 సంవత్సరాలు కలిసి పని చేశానని అన్నారు. కొంతమంది బ్రోకర్ల వల్ల రామ్ గోపాల్ వర్మ తన ప్రతిష్టను దిగజరుచుకుంటున్నాడని అన్నారు. రేపు విడుదల కావడానికి సిద్ధంగా ఉన్న డేంజర్ సినిమా ఆపివేస్తూ సిటీ సివిల్ కోర్ట్ ఆదేశాలు జారీ చేసిందని రేపు డేంజర్ సినిమా ఆగిపోయినట్లేనని అన్నారు. నన్ను ఒక్కడినే కాకుండా చాలామంది ని మోసం చేశాడని ఆయన పేర్కొన్నారు. సాయంత్రం 5 గంటల కు రామ్ గోపాల్ వర్మ బండారం బయటపెడుతానని అన్నారు.

    English summary
    RGV's Maa Ishtam postponed due to theaters issues, RGV issued a statement on this.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X