»   » వర్మ “మొగలిపువ్వు” ఫస్ట్ లుక్ (ఫొటో)...ఇది అదేనా?

వర్మ “మొగలిపువ్వు” ఫస్ట్ లుక్ (ఫొటో)...ఇది అదేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఎప్పటికప్పుడూ ఏదో ఒక సంచలనంతో ముందుకు రావాలని ప్రయత్నిస్తూంటారు. తాజాగా ఆయన "మొగలిపువ్వు" అనే కొత్త చిత్రం ఎనౌన్స్ చేస్తూ పోస్టర్ వదిలారు. అయితే ఈ చిత్రం హిందీలో ఆయన దర్శకత్వంలో సచిన్ జోషి హీరోగా రూపొందిస్తున్న ఎఫైర్ చిత్రం తెలుగు వెర్షన్ అని తెలుస్తోంది. అయితే ఆయన ఈ ఫస్ట్ లుక్ తో పాటు వదిలిన ప్రెస్ నోట్ లో ఆ విషయం ప్రస్దావించలేదు. ఈ ఫస్ట్ లుక్... ప్రెస్ నోట్ లో ఆయన చెప్పిన మాటలు ఓ సారి చూడండి..

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ప్రెస్ నోట్ లో ...

RGV’s “Mogali Puvvu” First Look

ప్రతి పెళ్ళైన మగాడూ బయట ఒక అందమైన అమ్మాయి కనిపిస్తే టెంప్ట్ అవుతాడు..ప్రతి భార్య తన భర్తకేదైనా ఒక సీక్రెట్ ఎఫైర్ ఉందేమోనని భయపడుతూ వుంటుంది. ప్రతి పెళ్ళైన వాడి సెల్ ఫోన్ లో తన భార్యకి తెలియని సీక్రెట్ లు ఉంటాయి. ఎఫైర్ లు అనేవి పెళ్లి వ్యవస్థ పుట్టినప్పటినుంచీ వున్నాయి.

కాని సెల్ ఫోన్లలో పాస్ వర్డ్ లు, వాట్స్అప్ లు, పేస్ టైం లు కెమెరాలు వగైరా వచ్చినప్పటినుంచి అవి ఒక భయంకర స్థితికోచ్చేసాయి.... టెక్నాలజీయే కాకుండా స్త్రీల పై అత్యచారాలని అరికట్టడానికి కొత్తగా వచ్చిన నిర్భయ లాంటి చట్ట సవరణలు స్త్రీ పురుష సంబంధాలలో భూకంపాలు పుట్టిస్తున్నాయి. ఇలాంటి బ్యాక్ గ్రౌండ్ తీసుకుని రాసిన కధే "మొగలిపువ్వు". ఇది ఒక రొమాన్సు, ఫ్యామిలీ డ్రామాలతో కూడిన సైకాలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ అంటున్నారు రామ్ గోపాల్ వర్మ.

‘ఎఫైర్' విషయానికి వస్తే...

గత కొంత కాలంగా రామ్ గోపాల్ వర్మ కి బాక్స్ ఆఫీసు వద్ద ఒక్క హిట్ కూడా లేదు. ఐస్ క్రీమ్ 1, అండ్ 2 సినిమాల తర్వాత వర్మ చేస్తున్న మరో రొమాంటిక్ హర్రర్ సినిమా ‘ఎఫైర్'.

సచిన్ జోషి హీరోగా నటిస్తున్న ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఇది. ఒకేసారి ఈ సినిమాని తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని హిందీలో ‘మెంటల్'గా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసారు. 1987లో విడుదలైన హాలీవుడ్ సినిమా ‘ఫాటల్ అట్రాక్షన్' అనే సైకలాజికల్ థ్రిల్లర్ కు ఇది ఫ్రీమేక్ అని సమాచారం. బాలీవుడ్ హాట్ భామ కైనాత్ అరోరా, మీర చోప్రాలు ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

English summary
Ram Gopal Varma has released another first look. This movie’s title is “Mogali Puvvu” and deals with romance, family drama and psychological crime thriller story.
Please Wait while comments are loading...