»   » రామ్ గోపాల్ వర్మ...తాజా చిత్రం బెజవాడ రౌడీలు

రామ్ గోపాల్ వర్మ...తాజా చిత్రం బెజవాడ రౌడీలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ గోపాల్ వర్మ తాజాగా మరో చిత్రం ప్లాన్ చేస్తున్నారు. ఆ చిత్రం టైటిల్ బెజవాడ రౌడీలు. తాజాగా తెలుగుదేశం లీడర్ చలసాని పండు హత్య, రౌడీ ప్యాక్షనిజం వార్తల్లో ఉండటంతో ఈ న్యూస్ రామ్ గోపాల్ వర్మ ఎనౌన్స్ చేసారని అంతా భావిస్తున్నారు. ఇక తన చిత్రం విజయవాడ..రౌడీ పాలిటిక్స్ చుట్టూ తిరుగుతుందని ఆయన అంటున్నారు. అప్పలరాజు చిత్రం పూర్తవగానే ఈ చిత్రం ప్రారంభిస్తానంటున్నారు. ఇక గతంలోనూ విజయవాడు కాలీజీ,పాలిటిక్స్ నేపద్యంలో శివ చిత్రం రూపొందించి ఘన విజయం సాధించారు వర్మ.

ఈ విషయమై ఆయన విడుదల చేసిన ప్రెస్ నోట్ లో...నాకు విజయవాడతో విడతీయలేని అనుభందం ఉంది. అక్కడ రౌడీయిజాన్ని, వారి మధ్య జరిగే గొడవ లను నేను కాలేజీలో చదువుకునేటప్పుడు చాలా దగ్గరగా గమనించేవాడ్ని. అలాగని ఈ చిత్రాన్ని శివతో పోల్చటానికి వీలు లేదు. ఇక్కడ హైదరాబాద్ రౌడీలు...విజయవాడ రౌడీయిజంలా ఆర్గనైజడ్ క్రేమ్ మెంటాలిటీ కాదు. నేను ముంబాయి మాఫియాని, రాయలసీమ ప్యాక్షనిజాన్ని వెండితెరపై చూపాక, విజయవాడ ముఠా కక్షలు గురించి తీస్తున్నాను. ఈ చిత్రం స్క్రిప్టు ఫైనల్ స్టేజస్ లలో ఉంది అన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu