»   » రామ్ గోపాల్ వర్మ పిటీషన్ తిరస్కరణ

రామ్ గోపాల్ వర్మ పిటీషన్ తిరస్కరణ

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  RGV's petition against Dhanalakshmi dismissed
  హైదరాబాద్ : సత్య 2 సినిమాను నిర్మించిన ప్రముఖ డైరక్టర్ రామ్ గోపాల్ వర్మ కు నాంపల్లి కోర్టులో రెండోసారీ చుక్కెదురు అయ్యింది. సెన్సార్ బోర్డ్ ప్రాంతీయ అథికారిణి ధనలక్ష్మి తన సినిమాకు ఉద్దేశపూర్వకంగా ఆటంకాలు కల్పిస్తున్నారని, ఆమెపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన రెండోసారి ధాఖలు చేసిన పిటీషన్ ను కూడాకోర్టు తిరస్కరించిందని సమాచారం. కొద్దిరోజులు క్రితం నాంపల్లి కోర్టులో వర్మ తరుపు న్యాయవాది పిటీషన్ వేయగా అది తమ పరిధిలోకి రాదంటూ ఈ నెల 20న తిరస్కరించింది.

  ఈ విషయమై తాము పలువురు న్యాయవాదులను సంప్రదించామని,సెన్సార్ బోర్డ్ హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం మసాబ్ ట్యాంక్ కు ప్రాంతంలో ఉండటంతో నాంపల్లి కోర్టులో పిటీషన్ దాఖలు చేయాలని వారు సూచించడంతో 12వ సీఎంఎంకోర్టులో పిటీషన్ పేర్కొంటూ వర్మ తరుపు న్యాయవాది రెండోసారి పిటీషన్ దాఖలు చేసారు. కోర్టు వర్గాల సమాచారం మేరకు...రెండో పిటీషన్ పైనా పరిథి తమది కాదు అని కోర్టు రాసిందని తెలుస్తోంది. దీనిపై వర్మ న్యాయవాదిని సంప్రదించగా...తమ పిటీషన్ ని కోర్టు రెండోసారి తిరస్కరించిన విషయం తమనకు తెలియదని చెప్పారు.

  రామ్ గోపాల్ వర్మ వేసిన పిటీషన్‌పై సెన్సార్ ఆఫీసర్ ధనలక్ష్మి స్సందించినట్లు తెలుస్తోంది. సినిమాల సెన్సార్ విషయంలో తాను ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం లేదని, రివ్యూ కమిటీ సభ్యులంతా కలిసే సెన్సార్ చేస్తామని, వర్మ పిటీషన్ దాఖలు చేసే ముందు రివ్యూ కమిటీని సంప్రదించి ఉండాల్సిందని వ్యాఖ్యానించినట్లు సమాచారం.

  సత్య 2 సినిమాలో ముగ్గురు ప్రముఖ వ్యక్తులను ఉద్దేశించేలా సన్నివేశాలు ఉన్నాయని, ఓ టీవీ ఛానల్ నుండి సెన్సార్ బోర్డుకు మెమోరండం అందిందని, సినిమాలో నుండి తమ సీఈవో పేరు తొలగించాలని వారు కోరినట్లు సమాచారం. వర్మ సినిమాలో ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ టీవీ9 సీఈఓ రవిప్రకాష్‌, మాజీ డీజీపీ దినేష్ రెడ్డి, వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ లను ఉద్దేశించిన సన్నివేశాలు ఉన్నట్లు ఫిల్మ్ నగర్లో చర్చించుకుంటున్నారు.

  కాగా...పిటీషన్ దాఖలు చేయడానికి ముందు ఆయన పలు టీవీ ఛానళ్లలో ఈ విషయమై లైవ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ఇండస్ట్రీ పెద్దలు మద్దతు ప్రకటించారు. వర్మకు మద్దతుగా నిలిచిన వారిలో ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు, మోహన్ బాబు కాడా ఉన్నారు. ఇప్పటి వరకు సెన్సార్ బోర్డ్ ఆఫీసర్ ధనలక్ష్మి గురించి ఎవరికీ ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పలువురు నిర్మాతలు వాపోయారు.

  English summary
  The Nayampalli Court in Hyderabad dismissed petition filed by director Ram Gopal Varma against Censor Board Officer Dhanalakshmi. Early this month on 11th November RGV alleged that Dhanalakshmi had harassed him, used abusive language and caused him financial losses while clearing his film Satya 2.
 He approached the Court on this matter. The Court directed the police to file a case against the CB officer. Today the Court dismissed the case citing that petition lacks evidence to even make allegations.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more