»   » వర్మ – మోహన్ బాబుల ‘రౌడీ’ ఫస్ట్ లుక్ (ఫోటోలు)

వర్మ – మోహన్ బాబుల ‘రౌడీ’ ఫస్ట్ లుక్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మోహన్ బాబు - మంచు విష్ణు ప్రధాన పాత్రల్లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'రౌడీ'. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు. మోహన్ బాబుకి జోడీగా జయసుధ నటించనున్న ఈ సినిమాలో మంచు విష్ణు సరసన శాన్వి హీరోయిన్ గా కనిపించనుంది.

ఏవి పిక్చర్స్ బేనర్లో పార్థ సారథి, గజేంద్ర, విజయ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఫోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాని రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో పవర్ఫుల్ యాక్షన్ అండ్ పొలిటికల్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఎమోషన్ సీన్లతో పాటు హై ఓల్టేజ్ సన్నివేశాలు ఇందులో ఉంటాయని తెలుస్తోంది.

సినిమాలో మోహన్ బాబు పెద్ద కుమారుడుగా కన్నడ కిషోర్, రెండవ కుమారుడుగా మంచు విష్ణు నటిస్తున్నట్లు సమాచారం. వర్మ కు అత్యంత ఇష్టమైన గాడ్ ఫాధర్ పోలికలతోనే ఈ చిత్రం తెరకెక్కుతోందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. రిలీజైన ఫస్ట్ లుక్ ఫోటోలు చిత్రంపై క్రేజ్ ని క్రియేట్ చేస్తున్నాయి.

ఫస్ట్ లుక్ ఫోటోలు స్లైడ్ షో లో...

మోహన్ బాబు మాట్లాడుతూ...

మోహన్ బాబు మాట్లాడుతూ...

రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నాం. నా పోర్షన్ షూటింగ్ అయిపోయింది. విష్ణు పోర్షన్ నడుస్తోంది. అలాంటి డైరెక్టర్‌ని ఇంతదాకా నేను చూడలేదు. డైరెక్షన్ తప్ప అతనికి వేరే ధ్యాసే ఉండదు. విష్ణు కెరీర్‌లో బెస్ట్ సినిమాగా ఇస్తానని చెప్పాడు.

మోహన్ బాబు కంటిన్యూ చేస్తూ...

మోహన్ బాబు కంటిన్యూ చేస్తూ...

ఈ చిత్రంలో నేను, విష్ణు తండ్రీ కొడుకులుగా నటిస్తున్నాం. నేను, వర్మ కలిసి చేస్తున్నామంటే చాలా మందికి ఆశ్చర్యం కలుగుతోందని మాకు తెలుసు. కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా సినిమా చేసుకుంటూ వెళ్తున్నాం అన్నారు.

సెంటిమెంట్ కూడా...

సెంటిమెంట్ కూడా...

రౌడీ సెంటిమెంట్‌ మోహన్‌బాబుకి బాగా కలిసొచ్చింది. రౌడీగారి పెళ్లాం, అసెంబ్లీ రౌడీ, రౌడీ మొగుడు... ఇలా ఎక్కువ సార్లు వెండి తెరపై ఆయన రౌడీగానే కనిపించారు. ఇప్పుడు మరోసారి ఆ అవతారంలో వినోదం పంచబోతున్నారు.

మార్చిలో...

మార్చిలో...

'అన్నగారు', 'ఒట్టు' అనే పేర్లు పరిశీలించారు. చివరికి 'రౌడీ'వైపే చిత్రబృందం మొగ్గుచూపించింది. షూటింగ్‌ దాదాపుగా పూర్తి కావచ్చింది. మార్చి నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది.

సర్కార్ కాదు

సర్కార్ కాదు

ఈ చిత్రం సర్కార్ కి తెలుగు వెర్షన్ అంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వీటిని వర్మ ఖండిస్తూ వస్తున్నారు. అయితే అదే తరహా కథాంశమని చెప్పుకుంటున్నారు. ఇప్పుడీ ఫస్ట్ లుక్ ఫోస్టర్స్ కూడా సర్కార్ తరహా చిత్రమే అనే అనుమానం ధృవీకరిస్తున్నట్లుగా ఉన్నాయి.

English summary
The first look of ‘Rowdy’ film released today reveals little about the movie, aside from the novel look of Dr. Mohan Babu’s take on the character, and the fact that as a Hero he is extremely dominating even today.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu