twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెన్సేషనల్ ‘శివ’ ని రీ రిలీజ్ చేస్తున్నారు

    By Srikanya
    |

    హైదరాబాద్: తెలుగు సినిమా గతిని మార్చి, తెలుగు సినిమా ప్రేక్షకుడి మతి పోగొట్టి చరిత్రలో నిలిచిపోయిన చిత్రం ‘శివ'. ఈ చిత్రం అక్టోబర్ 5 కు పాతిక సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేయాలని నిర్ణయించారు. నవంబర్ లో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయన మీడియాకు తెలియచేసారు. ఇప్పుడున్న టెక్నాలిజీకి అణుగుణంగా డిజిటల్ లోకి మార్చి రీ మాస్టర్ ప్రింట్ తో విడుదల చేస్తారు.

    నాగార్జున మాట్లాడుతూ... ఈ సినిమా 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాను నవంబర్ నెలలో తిరిగి విడుదల చేస్తున్నాం. డిజిటల్ రీమాస్టర్ ప్రింట్ తో సుమారు 100 థియేటర్లలో ‘శివ' సినిమాను ప్రదర్శిస్తాం అని అన్నారు.

    RGV’s Shiva to be re-released in November

    అలాగే... నా జీవితంలో ఎన్నో తప్పులు చేసాను. ఎప్పుడూ బాధపడలేదు. కానీ ఒక్క శివ తీసాను. అందుకు గర్విస్తాను. నా సినీ జీవితాన్నే కాక, వ్యక్తిగతం జీవితాన్ని కూడా మార్చేసిన సినిమా అది అన్నారు.


    రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ... శివ సినిమాతో అందరూ నేను రూల్స్ బ్రేక్ చేసానని అంటూంటారు. కానీ అది తప్పు. ఎందుకంటే అప్పటికి నాకు అస్సలు రూల్స్ అనేవే తెలియదు. అందుకే ఆ చిత్రం ట్రెడ్ సృష్టించింది. ఇప్పటికీ, ఎప్పటికీ నేను చెప్పేది ఒకటే శివ కేవలం నాగార్జున వల్లే సాధ్యమైంది అన్నారు.

    English summary
    Ram Gopal Varma’s debut film Shiva has now completed 25 years of its release and as a tribute, the makers are planning to re-release the film in November.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X