twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫస్ట్ లుక్: రామ్‌ గోపాల్‌వర్మ ‘ స్పాట్‌ ’ (పోస్టర్)

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఎప్పుడూ ఏదో ఒక సంచలనం క్రియేట్ చేసి వార్తల్లో నిలిచే దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. అయితే కొంత కాలంగా ఆయన సినిమాలు వరస పెట్టి ఫెయిల్యూర్ కావటంతో సంచలనాలకు చలనం లేకుండాపోయింది. వాటిని అందరూ లైట్ గా తీసుకుంటున్నారు. ‘రక్త చరిత్ర' తర్వాత వర్మ కి హిట్‌ లేకుండా పోయింది. అప్పటికీ వర్మ హిట్‌లతో సంబంధం లేకుండా సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు వర్మ మరో టైటిల్‌తో ముందుకొస్తున్నాడు. టైటిల్‌నే ఆకట్టుకునే విధంగా వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం పేరు ‘ స్పాట్‌ '. ఈ చిత్రం రక్తచరిత్రకు సీక్వెల్‌లా కనిపిస్తుంది. ఈ చిత్రం ఆడియో పోస్టర్ ని గతంలో విడుదల చేసారు. ఇప్పుడు ఫస్ట్ లుక్ ని విడుదల చేసి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.మీరు చూస్తున్నది ఆ చిత్రం ఫస్ట్ లుక్.

    ఈ చిత్రంలో రక్తచరిత్ర సినిమాలో చెప్పలేని అంశాలన్నీ వర్మ ఈ చిత్రంలో చూపిస్తానన్నారు. గతంలో తీసిన రక్తచరిత్ర సినిమా వివాదాలకు కేంద్ర బిందువైన సంగతి తెలిసిందే. అయితే కొందరి నుంచి ఒత్తిళ్ల కారణంగా తను కొన్ని సన్నివేశాలను చిత్రీకరించలేకపోయానని..వాటన్నంటీని ఈ చిత్రం ద్వారా తెరకెక్కిస్తానని వర్మ చెప్పారు. స్పాట్‌ పేరుతో తీస్తున్న ఈ చిత్రంలో ఓబుల్‌రెడ్డి హత్య జరిగే ముందు ప్రత్యర్థులు వేసిన ప్లాన్‌, అది అమలు చేసిన విధానం, ఆ తర్వాత ఎదురైన పరిణామాలను వర్మ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు.

    అలాగే... ఈ చిత్రంతో రామ్ గోపాల్ వర్మ నటుడిగా మారబోతున్నారు అని లేటెస్ట్ ఫిల్మ్ నగర్ టాక్. వరుసగా పరాజయాలు ఎదురవుతున్నా, కొత్త సినిమాను ఎలా మార్కెట్ చేసుకోవాలో తెలిసిన వర్మ నటుడిగా కొత్త అవతారం ఎత్తారు అంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా ప్రకటించిన ‘స్పాట్' సినిమాలో వర్మ కీలక పాత్రలో కనిపిస్తారని సమాచారం. వర్మ నటన ఎలా ఉంటుందో..? అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. రక్తచరిత్ర సినిమాతో వర్మ గాయకుడిగా మారారు. అదే సినిమాతో వాయిస్ ఓవర్ ఇవ్వటం ప్రారంభించారు. ఆ తర్వాత ప్రతి సినిమాలో వర్మ వాయిస్ వినిపిస్తూ ఉంది. ఇక నటుడిగా కూడా విశ్వరూపం చూపిస్తారేమో.. అని అంటున్నారు.

    RGV's Spot Movie First Look

    'స్పాట్‌' చిత్రం పూర్తి డిటేల్స్ వర్మ మాటల్లోనే...

    వర్మ మాటల్లోనే ''స్పాట్‌ అనేది వాడుక భాషలో ఓ మనిషిని చంపడానికి ఫ్యాక్షనిస్టులు పెట్టుకున్న ముద్దు పేరు. ఈ పదం ఎంత సింపుల్‌గా ఉంటుందో... దాని అసలు స్వరూపం చూస్తే అంతగా ఒళ్లు గగుర్పొడుస్తుంది. 'రక్తచరిత్ర' తీస్తున్నప్పుడు నేను కలిసిన మనుసుల్ని, విన్న విషయాలను నా జీవితంలో మరచిపోలేను. ఆ విషయాలకు 'రక్తచరిత్ర' రెండు భాగాల్లో వంద శాతం న్యాయం చేయలేకపోయాను. దానికి ఒక కారణం రెండు గంటల సినిమాల్లో మహాభారతం లాంటి రక్తచరిత్ర కథను ఎంతని చూపించగలం?

    ఇంకో ముఖ్య కారణం అప్పుడున్న పరిస్థితుల్లో నాపై పేర్లు చెప్పడానికి వీల్లేని అనేక మంది నుంచి ఒత్తిళ్లు రావడం. 'రక్తచరిత్ర' వెనుక ఉన్న అసలు చరిత్రకు న్యాయం చేయలేకపోయాననే బాధ ఇప్పటికీ నా మనసును పీకుతూనే ఉంది. మరేం చేద్దామని ఆలోచించిన తర్వాత ఓబుల్‌ రెడ్డి స్పాట్‌ను ఓ అధ్యయనంలా చేస్తే ఎలా ఉంటుంది అనే ఐడియా వచ్చింది. దీన్నే ఒక సినిమాగా తీయాలని నిర్ణయించాను.

    'రక్తచరిత్ర 1' లో 10 నిమిషాలపాటు ఉన్న ఓబుల్‌రెడ్డి హత్య సన్నివేశాన్ని పూర్తి సినిమాగా తీయాలనుకోవడానికి కారణం ఓబుల్‌ రెడ్డికి స్పాట్‌ పెట్టడానికి వెనుక ఉన్న అసలు కారణాల్ని, వ్యక్తుల్ని... స్పాట్‌ పెట్టాక వచ్చిన పరిస్థితుల్ని బయటపెట్టాలనుకోవడమే. హైదరాబాద్‌ నగరాన్ని కంపింపజేసిన ఆ స్పాట్‌ 1996లో హైదరాబాద్‌లోని మాసాబ్‌ట్యాంక్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో జరిగింది.

    రాయలసీమ ఫ్యాక్షన్‌ కోరలు మొదటిసారిగా కాటు వేసింది ఈ స్పాట్‌తోనే. దీని వెనుక జరిగిన అసలు విషయాల్ని ఆ స్పాట్‌ పెట్టిన వాళ్ల నుంచి ఈ మధ్య తెలుసుకున్నాను. స్పాట్‌ పెట్టడానికి ముందు, తర్వాత ఎంతగా చర్చలు జరుగుతాయో తెలుసుకున్నాక షాక్‌ అయ్యాను. ఆ పరిణామాలను ప్రేక్షకులకు కళ్లకు కట్టినట్లు చూపించే ఉద్దేశంతోనే ఈ సినిమా చేస్తున్నాను'' అని చెప్పారు రామ్‌గోపాల్‌వర్మ.

    English summary
    The first look poster of Ram Gopal Varma’s next Spot is finally out. Varma himself admitted that Spot is an extension of Obul Reddy episode in his previous film and the film deals about the planning and execution of a murder.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X