ఉన్మాదం...ఉద్వేగం...(‘26/11 ఇండియాపై దాడి’ప్రివ్యూ)

By Srikanya

హైదరాబాద్ : 2008లో ముంబయ్‌లో జరిగిన తీవ్రవాద దాడుల నేపథ్యంలో రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వం వహించిన చిత్రం '26/11 ఇండియాపై దాడి'. వరస ప్లాపుల్లో ఉన్న వర్మ చేస్తున్న ఈ చిత్రం యదార్ద సంఘటనపై ఆధారపడి ఉండటంతో అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. 166 ప్రాణాలు కోల్పోయిన ఈ తీవ్రవాద సంఘటన ప్రతీ భారతీయుడు మదిలో చెరగని ముద్రవేసుకుంది. ఈ చిత్రానికి సంభందించి వర్మ రిలీజ్ చేసిన ఫుటేజి ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు పెంచింది. వాటిని ఎలా అందుకుంటాడో చూడాలి.

ముంబై జాయింట్ పోలీస్ కమీషనర్ రాకేష్ మరియా(నానా పటేకర్) నేరేషన్ లో మొదలయ్యే ఈ చిత్రం ఓ పది మంది టెర్రరిస్టులు గేట్ వే ఆఫ్ ఇండియాలో ఓ పడవని హైజాక్ చేసి ముంబైలోకి ఎలా వచ్చారు...వారు ఎలా పథకం ప్రకారం దాడులు చేసారు.. ఆ సమయంలో ఎలర్టైన పోలీసులు వారిని ఎలా అంతమొందించారు..కసబ్ ని ఎలా అరెస్టు చేసారు అన్న దిసగా కథనం నడుస్తుంది.

తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న కాంతారావు మాట్లాడుతూ - ''నిజాయతీగా వర్మ చేసిన మంచి ప్రయత్నం ఇది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మన దేశంలో ఇలాంటి దాడి జరగలేదు. ప్రతి భారతీయుడ్ని వణికించిన సంఘటన అది. ఎంతో పరిశోధించి రాము ఈ సినిమా చేశారు'' అన్నారు.

''ఈ దాడులు జరిగిన సమయంలో రాకేష్‌మెహ్రా అనే పోలీస్ అధికారి ఇంట్లో రిలాక్స్ అవుతుంటే, ఒకేసారి మూడు ల్యాండ్ లైన్లు మోగాయట. అలాగే హంతకుడు కసబ్ కేసులో ముఖ్య సాక్షి అయిన తొమ్మిదేళ్ల పాప కసబ్‌ని ఏ పరిస్థితిలో చూసింది? దాడులు జరుగుతున్న సమయంలో పోలీసులు నిస్సహాయత.. ఈ విషయాలతో పాటు మరిన్ని విశేషాలను చెప్పడం జరిగింది'' అంటున్నారు రామ్‌గోపాల్‌వర్మ.

బ్యానర్ : ఈరోస్ ఇంటర్నేషనల్ - ఆలంబ్రా ఎంటర్టైన్మెంట్
నటీనటులు : నానా పటేకర్, సంజీవ్ జైస్వాల్, అతుల్ కులకర్ణి,గణేష్ యాదవ్,రవికాలే తదితరులు
సంగీతం : రూషిన్ దలాల్, అమర్ మొహిలే
ఛాయాగ్రహణం: హర్షరాజ్‌ షరఫ్‌
దర్శకుడు : రామ్ గోపాల్ వర్మ
నిర్మాత : పరాగ్ సంఘ్వి, గోపాల్ దల్వి
విడుదల తేదీ :01, మార్చి 2013.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X