»   » కెలకటానికా?: 'కమ్మ' కులంపై వర్మ సాంగ్ (వీడియో)

కెలకటానికా?: 'కమ్మ' కులంపై వర్మ సాంగ్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ప్రస్తుతం తన దర్శకత్వంలో రూపొందుతున్న వంగవీటి చిత్రం ఎలా ఉంటుందో తెలియదు కానీ ఈ సినిమా ప్రీ రిలీజ్ హైప్ తేవాలని మాత్రం ఓ రేంజిలో కృషి చేస్తున్నారు. అందులో భాగంగా ఆ మధ్యన ఈ చిత్రంలో వంగవీటి ఫస్ట్ల్ లుక్ వదిలిన వర్మ ఇప్పుడు ఏకంగా పాటనే వదిలారు. కమ్మ ..కమ్మ అంటూ సాగే ఈ పాటను మీరు ఇక్కడ చూడవచ్చు.


కాపు రిజర్వేషన్స్ పై భగ్గుమంటున్న ఈ సమయంలో ఇలా మరో కులం..పాటని వదలటంతో అందరి దృష్టినితన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు వర్మ.

తెలుగులో తన ఆఖరి సినిమా వంగవీటి అని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.శివ చిత్రంతో మొదలైన తన తెలుగు సినీ ప్రస్థానాన్ని వంగవీటితో ముగించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

RGV's Vangaveeti movie Kamma song

వంగవీటి కథ అత్యంత నిజమైన మహా గొప్ప కథ అని వర్మ పేర్కొన్నారు. విజయవాడ రౌడీయిజం నేపథ్యంగా వంగవీటి చిత్రం తీస్తున్నానని పేర్కొంటూ ఆయన మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు.

అలాగే ఈ చిత్రంలో దర్శకరత్న దాసరి నారాయణరావుతో పాటు కాపుల రిజర్వేషన్ల కోసం ఉద్యమించిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పాత్రలు కూడా ఉన్నట్లు వర్మ తెలిపారు. బెజవాడ రౌడీయిజం ప్రధాన కాన్సెప్ట్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని దాసరి కిరణ్ కుమార్ నిర్మిస్తున్నారు.

విజయవాడ గత చరిత్రని ఇప్పటికి, ఎప్పటికి చరిత్రలో నిలిచిపోయేలా చెయ్యటానికి మా "వంగవీటి" యూనిట్ శరవేగంతో సిద్ధమవుతోందని వర్మ చెప్పారు.

వంగవీటి రాధా, వంగవీటి మోహన రంగా, వంగవీటి రత్నకుమారి, దేవినేని నెహ్రు, దేవినేని గాంధీ, దేవినేని మురళి, కర్నాటి రామమోహనరావు, సిరిస్ రాజు, రాజీవ్ గాంధీ, నందమూరి తారక రామారావుతో పాటు ఈ చిత్రంలో తన పాత్ర కూడా ఉంటుందని వర్మ పేర్కొన్నారు.

English summary
Ram Gopal Varma tweeted: "kamma Kaapu" song for Vangaveeti is super aptly written by SiraSri and music is by Ravi Shanker of Takkum Tikkum fame in killing veerappan
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu