»   » అంత జరిగాక, ఫైనల్ గా క్షమాపణ కోరిన రామ్ గోపాల్ వర్మ!

అంత జరిగాక, ఫైనల్ గా క్షమాపణ కోరిన రామ్ గోపాల్ వర్మ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చేసిన ట్వీట్‌పై దుమారం రేగడంతో ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. తాను చేసిన ట్వీట్లకు నిజంగా మనస్తాపం చెందిన వారికి తాను క్షమాపణలు చెబుతున్నట్లు ట్వీట్‌ చేశారు.

అదే సమయంలో ప్రచారం కోసం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలనుకునేవారికి మాత్రం కాదని పేర్కొన్నారు.

అంతకుముందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చేసిన ట్వీట్‌ పై పెద్దఎత్తున చర్చ జరిగింది. సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తగా మరికొందరు చెప్పుతో కొడతామని వ్యాఖ్యానించడంపై వర్మ పైవిధంగా స్పందించారు.

ఇంతకీ వర్మ చేసిన ట్వీట్ ఏమిటంటే..

మహిళల దినోత్సవాన్ని పురుషుల దినోత్సవంగా మార్చేశారు ఆయన. దానికి కారణాన్ని కూడా ఆయన విశ్లేషించారు. ''ఏడాదిలో అన్నీ రోజులు పురుషులవేనని.. ఈ ఒక్కరోజు మహిళకు ఇచ్చారు. ఉమెన్స్‌ డే'ని 'మెన్స్‌ డే' అనాలి. మహిళలను పురుషులు సంతోష పెట్టినంతగా.. పురుషులను మహిళలు సంతోషపెట్టలేరు.

కనీసం పురుషుల దినోత్సవం రోజైనా మహిళలు వారిపై అరుపులు, కేకలు వేయకూడదు. వారికి కొంచెం స్వేచ్ఛనివ్వాలి. పురుషుల అందరి తరఫు నుంచి నేను మహిళలకు పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు చెప్తున్నాను. ఆ రోజు పురుషులు మహిళలకు ఏం చేయాలో నాకు తెలియదు.. కానీ ఏడాదిలో ఒక రోజు మాత్రం పురుషులు మహిళల దినోత్సవంగా జరుపుకోవాలని ఆశిస్తున్నాను.''అని ట్విటర్‌లో పేర్కొన్నారు.

ఈ విషయమైపై గోవాలో విశాఖ మాంభ్రే అనే సామాజిక కార్యకర్త ఫిర్యాదు దాఖలు చేశారు. ఇది దాఖలయ్యాక ఈ అంశంపై వర్మ రక్షణాత్మక ధోరణిలో ట్విటర్‌లో మరికొన్ని వ్యాఖ్యలు చేశారు. సన్నీ లియోన్‌ నిజాయతీ పట్ల తనకున్న గౌరవాన్ని బహిరంగంగా వ్యక్తీకరిస్తున్నానని తెలిపారు. ఇలా వ్యక్తీకరించడంలో నిజాయతీగా ఉన్నందుకు తన తల్లి, సోదరి, కుమార్తె తనను గౌరవిస్తారని చెప్పారు.

English summary
RGV put out a salacious tweet on Wednesday saying, “I wish all the women in the world give men as much happiness as Sunny Leone gives.” RGV has come in for a severe flak on Twitter and other media forums from feminists, activists, organisations like Ranaragini, the women’s wing of the Hindu Janajagruti Samiti and political parties like Sharad Pawar-led Nationalist Congress Party.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu