బెజవాడ రౌడీలుని ముంబైకి షిప్ట్ చేయటానికి వర్మ సన్నాహాలు
'బెజవాడ రౌడీలు" సినిమా చిత్రీకరణను తక్షణమే నిలిపేయాలంటూ సర్వోదయ సంస్థ ఆధ్వర్యంలో న్యాయవాదులు విజయవాడ పోలీస్ కమిషనర్ అమిత్‌గార్గ్‌ను కలిసి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. అంతేగాక పోలీసులు ఈ చిత్రం స్క్రిప్టుని తమకి పంపమని చెప్పటం జరిగింది. దాంతో వర్మ చిత్రం షూటింగ్ ని ముంబై కి షిప్ట్ చేసి మిగతా పార్ట్ ని ఫినిష్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక గతంలో జరిగిన ఘర్షణల ఆధారంగా దర్శకుడు రాంగోపాల్‌వర్మ ఈ చిత్రం నిర్మించడాన్ని ఏ మాత్రం సహించబోమని హెచ్చరించారు. ఈ చిత్రంలో తమ కుటుంబసభ్యులు నటించకుండా చూడాలని సినీప్రముఖులకు వారు విజ్ఞప్తి చేశారు. అయితే వర్మ వీటిని పట్టించుకోవటం లేదు.ఇప్పటికే కాలేశ్వరరావు మార్కెట్, కృష్ణా నది, దుర్గా ఆలయం ప్రాంతాల్లో ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేయటంతో కీలకమైన సీన్స్ వచ్చేసాయంటున్నారు. మిగిలినవి అవసరమైతే గ్రాఫిక్స్ లో చూసుకోవచ్చనే నిర్ణయానికి వచ్చారని వినిపిస్తోంది. మరో ప్రక్క వర్మ ఈ చిత్రం దసరాకి విడుదల చేస్తామని, పోలీసులు ఆపారనటం అబద్దమంటూ ప్రెస్ నోట్ విడుదల చేసారు.


Click it and Unblock the Notifications











