twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వర్మ ‘26/11 ఇండియాపై దాడి’ని రిజెక్ట్ చేసిన UAE

    By Bojja Kumar
    |

    ముంబై: రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన '26/11 ఇండియాపై దాడి' చిత్రానికి UAEలో చుక్కెదురైంది. ఇటీవల ఈ చిత్రాన్ని దుబాయ్ సెన్సార్ బోర్డ్ వీక్షించింది. అనంతరం ఈ చిత్ర ప్రదర్శనకు అనుమతిని నిరాకరించింది. దీంతో ఈచిత్రం అక్కడ విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు.

    పాకిస్థాన్ కు చెందిన లష్కరే తోఇబా ఉగ్రవాదులు నవంబర్ 26, 2008న భారత ఆర్థిక రాజధాని ముంబై నగరంపై దాడి చేసిన నేపథ్యాన్ని ఈ చిత్రంలో చూపించనున్నారు, ఈ చిత్ర ప్రదర్శన వల్ల లష్కరే తీవ్రవాదుల ఏమైనా అఘాయిత్యానికి పాల్పడుతారనే భయంతోనే UAE ఈచిత్ర ప్రదర్శనకు అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది.

    నవంబర్ 26, 2008న 10 మంది పాకిస్థాన్ లష్కరే తోఇబా ఉగ్రవాదులు ముంబై నగరంపై విరుచుకుపడి తాజ్ హోటల్, ఒబెరాయ్ హోటల్, చత్రపతి శివాజీ రైల్వే స్టేషన్, నారీమన్ హౌజ్ తదితర ప్రాంతాలపై దాడి చేసి వందలాది మందిని పొట్టన పెట్టుకున్నారు. ఆ తర్వాత ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగా వారిని అంతమొందించారు. ప్రాణాలతో చిక్కిన కసబ్ కు ఇటీవలే ఉరిశిక్ష విధించారు.

    అలుంబ్రా ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో సంజీవ్ జైస్వాల్ అనే నటుడు తీవ్రవాది కసబ్ పాత్రలో నటిస్తున్నాడు. ప్రముఖ నటుడు నానా పాటేకర్ ముంబై నటర పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నారు. మార్చి 1న ఈ సినిమా విడుదల కాబోతోంది.

    స్లైడ్ షోలో మరిన్ని వివరాలు, సినిమా స్టిల్స్....

    వర్మ ‘26/11 ఇండియాపై దాడి’ని రిజెక్ట్ చేసిన UAE

    ‘ద అటాక్స్ ఆఫ్ 26/11' పేరుతో రూపొందుతున్న ఈచిత్రాన్ని తెలుగులో ‘26/11 ఇండియాపై దాడి' పేరుతో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో ముంబై దాడుల సంఘటనలను కళ్లకు కట్టినట్లు చూపెట్టనున్నారు.

    వర్మ ‘26/11 ఇండియాపై దాడి’ని రిజెక్ట్ చేసిన UAE

    ఈ చిత్రంలో రామ్ గోపాల్ వర్మ స్వయంగా ఓ పాట పాడబోతున్నాడు. రచయిత భాస్కరభట్ల రాసిన ఈ పాట లిరిక్స్ ‘నెత్తుటి రుచి మరిగిందా?' అంటూ సాగుతుంది. ముంబై దాడుల ఘటనలకు అద్ధం పట్టేలా చాల పవర్ ఫుల్ గా ఈ పాట ఉంది.

    వర్మ ‘26/11 ఇండియాపై దాడి’ని రిజెక్ట్ చేసిన UAE

    ఈ చిత్రాన్ని ఇండస్ ఇన్‌స్పిరేషన్స్ పతాకంపై ఎఎస్ కాంతరావు నిర్మిస్తున్నారు. తక్కువ బడ్జెట్‌లో సినిమాలు పూర్తి చేసే రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా కోసం దాదాపు రూ. 25 కోట్లు ఖర్చు పెట్టారు.

    వర్మ ‘26/11 ఇండియాపై దాడి’ని రిజెక్ట్ చేసిన UAE

    వర్మ మాట్లాడుతూ.... నేను భయపడటమంటే ఈ సినిమా బాగా వస్తుందా లేదా? ప్రేక్షకులకు నచ్చుతుందా అని కాదు. 26/11 దాడుల సమయంలో ప్రత్యక్షంగా అక్కడ ఉన్న పోలీసు అధికారులు, ఇతర బాధితులు నాతో పంచుకొన్న విషయాల్ని నేను సరిగ్గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాగలుగుతానా లేదా? అనే భయంతో ఈ సినిమా చేశాను అన్నారు.

    వర్మ ‘26/11 ఇండియాపై దాడి’ని రిజెక్ట్ చేసిన UAE

    అలాగే ఈ దాడులను ప్రత్యక్షంగా చూసిన బాధితుల తాలూకు ఉద్వేగం చాలా విలువైనది. దాన్ని చెడగొట్టకుండా తెరపైకి తీసుకురావాలనుకొన్నాను. పది మంది పడవలో నుంచి దిగి రెండు కోట్ల జనాభా ఉన్న ముంబై నగరాన్ని గడగడలాడించడం మామూలు విషయం కాదు. నాలుగేళ్లయినా ఆ దాడుల్ని మనం మరిచిపోలేకపోతున్నాం. అక్కడ ఏం జరిగిందనే విషయం అందరికీ తెలుసు. కానీ ఎలా జరిగిందన్నదే తెలియదు. ఆ రోజు రాత్రి 9:30 గంటల నుంచి ఒంటిగంట వరకు ఏం జరిగిందనే విషయాల్ని కళ్లకు కట్టినట్టు చూపించే ప్రయత్నమే ఈ సినిమా అంటున్నారు వర్మ.

    వర్మ ‘26/11 ఇండియాపై దాడి’ని రిజెక్ట్ చేసిన UAE

    ఈ చిత్రాన్ని నిలిపి వేయాలంటూ న్యాయవాది తీగల రాంప్రసాద్ మంగళవారం దాఖలు చేసిన పీటషన్‌ను రాష్ట్ర హైకోర్టు విచారణకు స్వీకరించింది.

    వర్మ ‘26/11 ఇండియాపై దాడి’ని రిజెక్ట్ చేసిన UAE

    ఈ కేసులో ప్రతివాదులగా ఉన్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, సెన్సార్ బోర్డుతో సహా మొత్తం 9 మందికి రాష్ట్ర హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. కేసు తదుపరి వచారణ మార్చి 5కి వాయిదా వేసింది. గతంలో న్యాయవాది రాంప్రసాద్ ఈ సినిమాను నిలిపి వేయాలని సెన్సార్ బోర్డును ఆశ్రయించగా, వారు తమ పరిధిలో లేదని చెప్పడంతో హైకోర్టుకెక్కారు.

    English summary
    Ram Gopal Varma's ambitious project The Attacks of 26/11, a movie based on the 26/11 Mumbai terror strike, has hit a rough patch with the UAE censor board. The film has been rejected after it was reviewed by the Dubai censors.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X