»   » పవన్ కళ్యాణ్ పుట్టిన రోజుపై వర్మ కామెంట్

పవన్ కళ్యాణ్ పుట్టిన రోజుపై వర్మ కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్స్ ఎప్పుడూ ఏదో ఒక సంచలనానికి దారి తీస్తూంటాయి. తాజాగా ఆయన పవన్ కళ్యాణ్ పై చేసిన ట్వీట్స్ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారాయి. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది.

ఆ ట్వీట్ లో ...పవన్ కళ్యాణ్ ఎప్పుడు పుడితే నాకేంటి... అతను పార్టీ పెట్టిన రోజే అతనికి నిజమైన జన్మదినం..ఆ రోజే నేను శుభాకాంక్షలు తెలియచేస్తాను అని వర్మ అన్నారు. గతంలోనూ... ఆయన పవన్ కళ్యాణ్ సొంతంగా ఓ రాజకీయ పార్టీ ప్రారంభించవచ్చని సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో ట్వీట్ చేశాడు. అంతేకాక మాటల జోరు పెంచి ఇప్పటి వరకు రాజకీయ నేతలుగా మారిన నటులు ఎంజీఆర్ నుంచి చిరంజీవిలలో పవన్ కళ్యాణ్ డైనమిక్ లీడర్ అని ప్రశంసలతో ముంచెత్తారు.

గతంలో ఆ ట్వీట్స్ ఇలా సాగాయి...'ఇప్పటి వరకు తాను నా జీవితంలో ఎప్పుడు ఓటు వెయ్యలేదని.. పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీని ప్రారంభిస్తే ఓటు వేస్తాను అనే మాటకు కట్టుబడి ఉంటాను. పవన్ కళ్యాణ్ కు తన ఓటు అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం పవర్ స్టార్ కు ఓటు వేసేందుకు చాలా మంది ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ లో ఆలోచనల్లో నిజాయితీ, కళ్లలో పట్టుదల. చరిష్మా, ఇంటెన్సిటిలను బాల్ థాకరేలో కూడా చూడలేదు. ప్రజారాజ్యం పార్టీకి పవన్ కళ్యాణ్ సారథ్యం వహించి ఉంటే అఖండ మెజారిటీని సాధించి ఉండేదని తన ప్రగాఢ విశ్వాసం' అని రాంగోపాల్ వర్మ వ్యాఖ్యలు చేశారు.


ఇంకా వివరణ ఇస్తూ... తాను పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి చేసిన వ్యాఖ్యలు కాదని.. తాను పవన్ ను కలిసి ఐదు సంవత్సరాలైందన్నాడు. ఓ డైరెక్టర్ గా కాకుండా ఓ ఆంధ్ర ప్రదేశ్ పౌరుడిగా స్పందించానని వర్మ తెలిపాడు. అంతేకాక చిరంజీవికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు కాదని.. పవన్ కళ్యాణ్ కు అనుకూలంగా చేసినవేనని వివరణ ఇచ్చాడు. పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటించిన చిత్రం 'అత్తారింటికి దారేది'. సమంత, ప్రణీత హీరోయిన్స్ . త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించారు. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాత. ఈ చిత్రాన్ని తొలుత ఈనెల 7న విడుదల చేద్దామనుకున్నారు. ఆ తరవాత 9న తీసుకొస్తామన్నారు. ఇప్పుడు ఆ రోజు కూడా రావడం లేదు. నిర్మాత మాట్లాడుతూ ''ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా విడుదల తేదీ మారుస్తున్నాం. ఈ చిత్రాన్ని ఎప్పుడు తీసుకొస్తామనేది త్వరలో చెబుతాం'' అన్నారు.

వైయస్సాపీ నాయకురాలు షర్మిల పాదయాత్రను ప్రస్దావిస్తూ... ఆమె పాద యాత్ర చాలా మంది ఫాలోయర్స్ ని మేల్కొపినట్లే...పవన్ పాద యాత్ర చేస్తే...హిస్టరీ క్రియేట్ అవుతుందని అన్నారు. ఆయన చేసే పాదపాత్ర చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు వర్మ. పవన్ కళ్యాణ్ పాద యాత్ర చేయాలనే ఆలోచన ఈ రకంగా..ఆయన ఇచ్చారు.

English summary
Ram Gopal Varma tweeted: "I dont care when pawan kalyan was born..I will wish him only when he starts his own party because that will be his true birthday".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu